గర్భవతి అని తెలిసినా కోరిక తీర్చమని వేధింపులు…

గర్భవతి అని తెలిసినా కోరిక తీర్చమని వేధింపులు…

pregnant wife killed her husband, due to sexual harassment: భార్య అయిదు నెలల గర్భవతి అని తెలిసి కూడా ఆమెను కోరిక తీర్చమని తరచూ లైంగిక దాడి చేస్తున్న భర్తను భార్య విషమిచ్చి చంపినఘటన తమిళనాడులో చోటు చేసుకుంది.

ఈరోడ్ జిల్లా అందియూర్ కు చెందిన నందకుమార్(35)కు ఏడు నెలల క్రితం మైథిలీ అనే యువతితో వివాహం అయ్యింది. ప్రస్తుతం ఆమె అయిదు నెలల గర్భవతి.ఇటీవల నంద కుమార్ కడుపు నొప్పి, విరేచనాలతో ఆస్పత్రిలో చేరాడు. అతడిని పరీక్షించిన వైద్యులు అతని రక్తంలో విషం కలిసినట్లు చెప్పారు.

ప్రాణాపాయ స్థితిలో ఉన్న నందకుమార్ వద్ద న్యాయమూర్తి వాంగ్మూలం తీసుకున్నారు. జనవరి 28వ తేదీన తాను భోజనం చేస్తుంటే చేదుగా అనిపించిందని..ఏంటని భార్యను అడిగితే ఏమీ లేదని చెప్పిందని తెలిపాడు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ నందకుమార్ ఫిబ్రవరి 15న కన్నుమూశాడు.

కేసు నమోదుచేసుకున్న పోలీసులు మైథిలిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. ఐదు నెలల గర్భంతో ఉన్న నన్ను భర్త రోజూ కోరిక తీర్చాలంటూ బలవంతం చేశావాడని…. గర్భవతినని తెలిసినా శరీరం సహకరిచట్లేదని చెప్పినా వినకుండా లైంగిక దాడి చేసేవాడని బాధపడింది.

ఎంత చెప్పినా వినిపించుకోకుండా లైంగికదాడి చేయటంతో అనారోగ్యం పాలయ్యానని అయినా భర్త అర్ధం చేసుకోకుండా లైంగికదాడి చేసేవాడని తెలిపింది. భర్త లైంగిక వేధింపులు తట్టుకోలేక ఆహారంలో విషంకలిపానని ఒప్పుకుంది. పోలీసులు శనివారం మైథిలిని అరెస్ట్ చేశారు.