Gujarat: ఎనిమిదో తరగతి బాలుడిపై ప్రిన్సిపల్ లైంగిక వేధింపులు.. అరెస్టు

పిల్లలకు విద్యాబుద్ధులు చెప్పి, కంటికి రెప్పలా చూసుకోవాల్సిన ప్రిన్సిపలే విద్యార్థిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. అధికారులు ఉద్యోగంలోంచి తొలగించారు.

Gujarat: ఎనిమిదో తరగతి బాలుడిపై ప్రిన్సిపల్ లైంగిక వేధింపులు.. అరెస్టు

Gujarat

Gujarat: తన స్కూల్ పిల్లల్ని కాపాడుకుంటూ బాధ్యతగా చూసుకోవాల్సిన ప్రిన్సిపలే విద్యార్థిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. దీంతో అతడిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన గుజరాత్‌లోని పూణా పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సూరత్‌లోని స్థానిక మున్సిపల్ పాఠశాలలో నిషంత్ వ్యాస్ అనే వ్యక్తి ప్రిన్సిపల్‌గా పనిచేస్తున్నాడు.

Boy Shot Dead: చిన్నారుల దొంగ-పోలీస్ ఆట.. తుపాకితో కాల్చడంతో బాలుడు మృతి

ఈ క్రమంలో తన స్కూళ్లోనే చదువుతున్న ఎనిమిదో తరగతి విద్యార్థిపై నిషంత్ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఒకసారి బాలుడిపై వేధింపులకు పాల్పడుతుండగా కొందరు విద్యార్థులు చిత్రీకరించిన వీడియో బయటపడింది. ఆ వీడియోలో ప్రిన్సిపల్ ఆ బాలుడిని వేధిస్తూ, దుస్తులు తీసేందుకు ప్రయత్నించాడు. ఈ వీడియో అక్కడ వైరల్‌గా మారింది. దీంతో ప్రిన్సిపల్ చేస్తున్న దారుణం వెలుగులోకి వచ్చింది. ప్రిన్సిపల్ వేధింపులపై స్కూల్ యాజమాన్యం స్పందించింది. అతడిని ఉద్యోగంలోంచి తొలగిస్తూ అధికారులు ఆదేశాలు జారీ చేశారు.

Monkeypox In AP: గుంటూరులో ఎనిమిదేళ్ల బాలుడికి మంకీపాక్స్ లక్షణాలు

మరోవైపు ఈ నెల 19న పోలీస్ స్టేషన్‌లో కూడా ఫిర్యాదు చేశారు. పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. అయితే, అప్పటి నుంచి ప్రిన్సిపల్ పరారీలోనే ఉన్నాడు. కాగా, శనివారం రాత్రి అతడ్ని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిని పోలీసులు కోర్టులో హాజరుపర్చనున్నారు.