మసాజ్‌ సెంటర్‌ పేరుతో వ్యభిచారం

  • Edited By: veegamteam , March 30, 2019 / 04:07 PM IST
మసాజ్‌ సెంటర్‌ పేరుతో వ్యభిచారం

చెన్నై: మసాజ్‌ సెంటర్‌ పేరుతో వ్యభిచారం నడుపుతున్న దంపతులను పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి ఇద్దరు యువతులను విడపించారు. చెన్నై తేనాంపేట వాసన్‌వీధిలో ఉన్న ఓ ప్రైవేటు అపార్టుమెంటులో దంపతులు సెంథిల్‌ (37), అతని భార్య శాంతి (32) మసాజ్‌ సెంటర్‌ నిర్వహిస్తున్నారు. మసాజ్‌ సెంటర్‌కు రాత్రి సమయంలో ఎక్కువ సంఖ్యలో యువకులు వచ్చి వెళుతున్నట్టు స్థానికులు పాండీబజార్‌ పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

గురువారం రాత్రి పోలీసులు సాధారణ దుస్తుల్లో వచ్చి మసాజ్‌ సెంటర్‌ వద్ద నిఘా వేశారు. అక్కడికి యువకులు వచ్చి వెళుతున్నట్లు తెలిసింది. దీంతో పోలీసులు వెంటనే మసాజ్‌ సెంటర్‌ లోపలికి వెళ్లి తనిఖీ చేశారు. ఆ సమయంలో యువతులతో వ్యభిచార కార్యకలాపాలు జరిపిస్తున్నట్లు తెలిసింది. మసాజ్‌ సెంటర్‌ యజమానులను పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి ఇద్దరు యువతులను విడిపించారు.