Murder Case : “చెప్పు” సాయంతో హత్యకేసును ఛేదించిన పోలీసులు

అక్టోబర్ 22న పూణేలోని బవ్‌ధాన్‌ ప్రాంతానికి చెందిన 27 ఏళ్ల యువకుడు మిస్ అయినట్లుగా పోలీసులకు ఫిర్యాదు అందింది. ఈ ఫిర్యాదుపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

Murder Case : “చెప్పు” సాయంతో హత్యకేసును ఛేదించిన పోలీసులు

murder case

Murder Case : అక్టోబర్ 22న పూణేలోని బవ్‌ధాన్‌ ప్రాంతానికి చెందిన 27 ఏళ్ల యువకుడు మిస్ అయినట్లుగా పోలీసులకు ఫిర్యాదు అందింది. ఈ ఫిర్యాదుపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. కనిపించకుండా పోయిన వ్యక్తి చెప్పు సాయంతో కేసును ఛేదించారు. వివరాల్లోకి వెళితే 27 యువకుడు ఓ మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. అది సదరు మహిళ భర్తకు తెలియడంతో యువకుడిని ఎలాగైనా అంతం చేయాలనీ భావించాడు. అనుకున్నదే తడవుగా హత్యకు పథకం పన్నాడు.

చదవండి : Murder : దారుణం.. పొట్టిగా ఉందని ఫ్రెండ్స్ హేళన చేయడంతో ప్రియురాలిని చంపేశాడు

ప్లాన్ ప్రకారం యువకుడిని ఇంటికి రప్పించి మరో ఇద్దరితో కలిసి హత్య చేశాడు. అనంతరం తన స్నేహితులతో కలిసి మృతదేహాన్ని మరోచోటుకి తరలించి.. అక్కడ అతడిని ఖననం చేసి ఆనవాళ్లు కనిపించకుండా చేశారు. అయితే కేసు విచారణలో తప్పిపోయిన యువకుడి సెల్ ఫోన్ నెంబర్ ఆధారంగా విచారణ చేపట్టిన పోలీసులు ఓ మహిళతో మాట్లాడినట్లు గుర్తించారు. అక్టోబర్ 22వ తేదికి ముందు రాత్రి అతడు సదరు మహిళతో రెండు సార్లు మాట్లాడినట్లు గుర్తించారు. మహిళ నంబర్ ఆధారంగా విచారణ ముమ్మరం చేశారు.

చదవండి : Beggars Murder: హైదారాబాద్‌లో యాచకుల హత్య.. వేరు వేరు చోట్ల ఒకేలా చంపేశారు

వివాహేతర సంబంధం నడిపిస్తున్న మహిళ ఇంటికి వెళ్లి విచారించారు పోలీసులు.. తమకేది తెలియదని పోలీసులకు సమాధానం ఇచ్చారు. అయితే వారి ప్రవర్తన అనుమానాస్పదంగా ఉండటంతో పోలీసులు ఇంటి పెరట్లో తనిఖీ చేశారు. ఓ చెప్పు కనిపించడంతో దాని ఆధారంగా విచారణ చేపట్టారు. భార్యభర్తలను అదుపులోకి తీసుకోని తమదైన శైలిలో విచారించారు పోలీసులు. తామే హత్యచేసినట్లు ఒప్పుకున్నారు. హత్యకు మరో ఇద్దరు సాయం చేసినట్లుగా పోలీసులకు తెలిపారు. దీంతో వివాహేతర సంబంధం పెట్టుకున్న మహిళ భర్తతోపాటు హత్యతో సంబంధం ఉన్న మరో ఇద్దరినీ అరెస్ట్ చేశారు పోలీసులు. తన భార్యతో చనువుగా ఉండటం వల్లనే హత్య చేసినట్లు నిందితుడు పోలీసులకు తెలిపారు.