Punjab Beauty Pageant : పంజాబ్ అందాల పోటీల్లో విజేతకు ఎన్నారై వరుడు బహుమతి.. వైరలవుతున్న వాల్‌పోస్టర్లు

పంజాబ్ లోని బతిండాలో నిర్వహించే అందాల పోటీల్లో విజేతగా నిలిచేవారికి ఎన్నారై వరుడిని బహుమతిగా ఇస్తామని వాల్‌పోస్టర్లు వెలిశాయి. బతిండాలోని పలు ప్రాంతాల్లో వెలసిన ఈ పోస్టర్లను చూసిన అనేక మంది అమ్మాయిలు, వారి తల్లితండ్రులు షాక్‌ అయ్యారు. దీంతో ఈ అందాల పోటీల నిర్వాహకులపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేశారు.

Punjab Beauty Pageant : పంజాబ్ అందాల పోటీల్లో విజేతకు ఎన్నారై వరుడు బహుమతి.. వైరలవుతున్న వాల్‌పోస్టర్లు

Punjab Beauty Pageant

Punjab Beauty Pageant : పంజాబ్ లోని బతిండాలో నిర్వహించే అందాల పోటీల్లో విజేతగా నిలిచేవారికి ఎన్నారై వరుడిని బహుమతిగా ఇస్తామని వాల్‌పోస్టర్లు వెలిశాయి. బతిండాలోని పలు ప్రాంతాల్లో వెలసిన ఈ పోస్టర్లను చూసిన అనేక మంది అమ్మాయిలు, వారి తల్లితండ్రులు షాక్‌ అయ్యారు. పోస్టర్లను చూసిన వారు నోరెళ్లబెట్టారు. దీంతో ఈ అందాల పోటీల నిర్వాహకులపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేశారు.

సాధారణంగా అందాల పోటీల్లో పాల్గొని విజేతలుగా నిలిచే అమ్మాయిలకు బహుమతిగా నగదు లేదా వజ్ర వైఢూర్య కిరీటాలను బహుమతిగా ఇస్తారు. కానీ, ఇక్కడ ఎన్నారై వరుడిని బహుమతిగా ఇస్తామని ప్రటించడమే వింతగా మారింది. ఈ పోస్టర్లు సోషల్ మీడియాలో సైతం ఈ పోస్టర్లు సర్క్యూలేట్ చేశారు. కుమార్తెలకు ఎన్నారై సంబంధాల కోసం చూస్తున్న తల్లిదండ్రులతో పాటు పలువురు వీటిపై ఆసక్తి చూపారు.

Professor Saibaba Supreme Court : ప్రొ.జీఎన్.సాయిబాబా విడుదలపై ఉత్కంఠ.. నేడు సుప్రీంకోర్టులో విచారణ

ఈ నెల 23వ తేదీన అందాల పోటీలను నిర్వహించాలని చూస్తున్న నిర్వాహకులపై పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. అందాల పోటీ విషయమై రూపొందించిన పోస్టర్లలో మహిళల గురించి అసభ్యకరమైన పదాలు రాసి ఉన్నట్టు గుర్తించామని తెలిపారు. ఆ మేరకు కేసు నమోదు చేశామని వెల్లడించారు.   అయితే, అందాల పోటీ ప్రకటన చూసి నెటిజన్లు షాక్ గురయ్యారు. ఇదేం బహుమతి అంటూ ఆశ్చర్యపోయారు. కాగా, ఇందులో తప్పేముందని కొందరు ప్రశ్నిస్తుండటం గమనార్హం.

ఈ ఘటనను పంజాబ్ సామాజిక భద్రత మరియు మహిళా శిశు అభివృద్ధి శాఖ మంత్రి బల్జీత్ కౌర్ ఖండించారు. బతిండాలో అందాల పోటీలు నిర్వహించి ఫలానా కులానికి చెందిన అమ్మాయిని పెళ్లికి ఎంచుకునేందుకు పోస్టర్లు అతికించడం తీవ్రంగా ఖండించదగినదని ఆమె ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఇందుకు సంబంధించి వెంటనే నివేదిక సమర్పించాలని సామాజిక భద్రత, మహిళా శిశు అభివృద్ధి శాఖ డైరెక్టర్‌ను మంత్రి కౌర్ ఆదేశించారు.

Russia vs Ukraine War: ఇక యుక్రెయిన్‌పై ‘భారీ’ క్షిపణి దాడులు చెయ్యం.. రష్యా అధ్యక్షుడు పుతిన్ కీలక నిర్ణయం..

బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని బతిండా డిప్యూటీ కమిషనర్‌ కు మంత్రి కౌర్ సూచించారు. ఈ విషయం సోషల్ మీడియా ద్వారా తన దృష్టికి వచ్చిందని చెప్పారు. ఈ ఘటనకు వ్యతిరేకంగా నగరంలో అవగాహన కవాతు నిర్వహిస్తామని చెప్పారు. విదేశాల్లో స్థిరపడాలనే పంజాబీల కోరిక కూడా ఇలాంటి ఘటనలకు దారితీస్తోందని మంత్రి కౌర్‌ అన్నారు.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.