Punjab : భార్య అక్రమ సంబంధం, తట్టుకోలేని భర్త..

అక్రమ సంబంధం పెట్టుకున్న తన భార్యను ఇంటికి తీసుకరావడానికి ఓ భర్త ప్రయత్నించాడు. కానీ...ఆమె నిరాకరించడంతో తీవ్ర మనస్థాపానికి గురైన అతను దారుణమైన నిర్ణయం తీసుకున్నాడు. ఇక్కడ భార్య సంబంధం పెట్టుకుంది..భర్త సోదరుడితో.

Punjab : భార్య అక్రమ సంబంధం, తట్టుకోలేని భర్త..

Punjab

Punjab Illegal Affair : మానవ సంబంధాలు మంటగలుస్తున్నాయి. అక్రమ సంబంధాలతో సంసారాలు రోడ్డు పడుతున్నాయి. ‘ఆ బంధం’ తప్పని తెలిసినా..గుట్టుచప్పుడు కాకుండా కొనసాగిస్తున్నారు. చివరకు విషయం తెలియడంతో దారుణాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రాణాలు తీసుకోవడం లేదా..చంపేయడం లాంటి వాటికి పాల్పడుతున్నారు. దీని కారణంగా..కొన్ని కుటుంబాలు రోడ్డు పడుతున్నాయి. వీరు చేసిన తప్పుకు కారణంగా..పిల్లలు అనాథలవుతున్నారు.

తాజాగా..ఇలాంటి ఓ ఘటన జరిగింది. అక్రమ సంబంధం పెట్టుకున్న తన భార్యను ఇంటికి తీసుకరావడానికి ఓ భర్త ప్రయత్నించాడు. కానీ…ఆమె నిరాకరించడంతో తీవ్ర మనస్థాపానికి గురైన అతను దారుణమైన నిర్ణయం తీసుకున్నాడు. ఇక్కడ భార్య సంబంధం పెట్టుకుంది..భర్త సోదరుడితో.

Read More : Boy Courage Snake Bite : భళా బుడ్డోడా.. కాటేసిన పామునే ఆస్పత్రికి పట్టుకెళ్లాడు!

వివరాల్లోకి వెళితే..
పంజాబ్ రాష్ట్రంలోని లూథియానాలో జస్వీర్ సింగ్,. గగన్ దీప్ దంపతులు నివాసం ఉంటున్నారు. జస్వీర్ ఇంటికి సోదరుడు మంగల్ సింగ్ వచ్చిపోతుండే వాడు. ఈ క్రమంలో..మంగల్ తో గగన్ దీప్ మాట్లాడుకోవడం పరిపాటి అయిపోయింది. దీంతో ఇద్దరి మధ్య ప్రేమ చిగురించింది. తప్పని తెలిసినా..అతడితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. కొన్ని రోజుల తర్వాత…మంగల్ సింగ్ తో కలిసి వేరే ఊరికి వెళ్లిపోయింది.

Read More : Trisha Marriage : త్రిష పెళ్లి..క్లారిటీ ఇచ్చిన పీఆర్ టీమ్

దీంతో జస్వీర్ తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు. భార్య ఆచూకీ తెలుసుకున్న జస్వీర్..అక్కడకు వెళ్లాడు. ఇంటికి వచ్చేయాలని..ఇది తప్పని నచ్చచెప్పే ప్రయత్నం చేశాడు. కనికరించని గగన్…మంగల్ తో కలిసి జస్వీర్ పై దాడికి పాల్పడ్డారు. ఇద్దరూ కలిసి కొట్టడంతో…అతను తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు. అలాగే ఇంటికి వచ్చి..మంగళవారం నాడు ఉరి వేసుకుని చనిపోయాడు. మంగల్ సింగ్, గగన్ దీప్ తన కొడుకు చనిపోయాడంటూ..తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.