Rajastan: డేరా అనుచరుడి హత్య కేసులో గ్యాంగ్‭స్టర్ అరెస్ట్.. పట్టుకునే క్రమంలో ఎదురుకాల్పులు

పంజాబ్ టాస్క్‌ఫోర్స్ కొద్దికాలంగా రాజ్ హుడా ఆచూకీ కోసం వెతుకుతోంది. అయితే పోలీసుల కంట పడకుండా ఒక చోట నుంచి ఒక చోటకు మారుతూ తెలివిగా తప్పించుకు తిరుగుతున్నాడు. ఇంతకుముందు పంజాబ్‌లోనూ, ఆ తర్వాత హర్యానాలోనూ, ఒకసారి హిమాచల్ ప్రదేశ్‌లోనూ కనిపించినట్టు చెబుతున్నారు. ఎట్టకేలకు ఆదివారం ఉదయం రాజస్థాన్ పోలీసుల సహకారంతో హుడాను పంజాబ్ పోలీసులు జైపూర్‌లో అరెస్టు చేశారు

Rajastan: డేరా అనుచరుడి హత్య కేసులో గ్యాంగ్‭స్టర్ అరెస్ట్.. పట్టుకునే క్రమంలో ఎదురుకాల్పులు

Punjab Police arrests sixth shooter in Dera follower murder case after brief encounter

Rajastan: డేరా సచ్చా సౌదా అనుచరుడైన ప్రదీప్ సింగ్ హత్య కేసులో నిందితుల్లో ఒక వ్యక్తిని అరెస్ట్ చేశారు. చాలా కాలంగా పరారీలో ఉన్న గ్యాంగ్‌స్టర్ రాజ్ హుడాను పంజాబ్‌ యాంటీ-గ్యాంగ్‌స్టర్ టాస్క్ ఫోర్స్ పోలీసులు రాజస్థాన్‌లో జైపూర్‌లో ఆదివారం వలవేసి పట్టుకున్నారు. పట్టుకునే క్రమంలో ఎదురుకాల్పులు కూడా చోటుచేసుకోవడం గమనార్హం. ప్రదీప్ సింగ్‌‌ను హత్య చేసిన ఆరుగురు నిందితుల్లో రాజ్ హుడా ఒకరు. ఈ ఆరుగురిలో నలుగురు షూటర్లు హర్యానాకు చెందిన వారు కాగా, ఇద్దరు పంజాబ్‌కు చెందిన వారు. వీరిలో ముగ్గురిని కొద్ది రోజుల క్రితమే అరెస్ట్ చేశారు.

పంజాబ్ టాస్క్‌ఫోర్స్ కొద్దికాలంగా రాజ్ హుడా ఆచూకీ కోసం వెతుకుతోంది. అయితే పోలీసుల కంట పడకుండా ఒక చోట నుంచి ఒక చోటకు మారుతూ తెలివిగా తప్పించుకు తిరుగుతున్నాడు. ఇంతకుముందు పంజాబ్‌లోనూ, ఆ తర్వాత హర్యానాలోనూ, ఒకసారి హిమాచల్ ప్రదేశ్‌లోనూ కనిపించినట్టు చెబుతున్నారు. ఎట్టకేలకు ఆదివారం ఉదయం రాజస్థాన్ పోలీసుల సహకారంతో హుడాను పంజాబ్ పోలీసులు జైపూర్‌లో అరెస్టు చేశారు. తొలుత హుడాను లొంగిపోవాల్సిందిగా పోలీసులు హెచ్చరికలు చేయగా, హుడా ఎదురు కాల్పులకు తెగబడ్డాడు.

Man Barks: రేషన్ కార్డులో తన పేరు మార్చాలంటూ కుక్కలా మొరుగుతూ అధికారులకు మొరపెట్టుకున్నాడు