క్యూనెట్ ఫ్రాడ్ కేసు: షారుక్, పూజా హెగ్డే, అల్లు శిరీష్‌లకు నోటీసులు

హైదరాబాద్: క్యూనెట్ ఫ్రాడ్ కేసులో సినీ ప్రముఖులు, క్రికెటర్లకు సైబరాబాద్ పోలీసులు షాక్ ఇచ్చారు. బాలీవుడ్ హీరోలు, హీరోయిన్లు, క్రికెటర్లకు నోటీసులు జారీ చేశారు. బాలీవుడ్

  • Published By: veegamteam ,Published On : February 26, 2019 / 02:36 PM IST
క్యూనెట్ ఫ్రాడ్ కేసు: షారుక్, పూజా హెగ్డే, అల్లు శిరీష్‌లకు నోటీసులు

హైదరాబాద్: క్యూనెట్ ఫ్రాడ్ కేసులో సినీ ప్రముఖులు, క్రికెటర్లకు సైబరాబాద్ పోలీసులు షాక్ ఇచ్చారు. బాలీవుడ్ హీరోలు, హీరోయిన్లు, క్రికెటర్లకు నోటీసులు జారీ చేశారు. బాలీవుడ్

హైదరాబాద్: క్యూనెట్ ఫ్రాడ్ కేసులో సినీ ప్రముఖులు, క్రికెటర్లకు సైబరాబాద్ పోలీసులు షాక్ ఇచ్చారు. బాలీవుడ్ హీరోలు, హీరోయిన్లు, క్రికెటర్లకు నోటీసులు జారీ చేశారు. బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుక్ ఖాన్, బొమన్ ఇరానీ, పూజా హెగ్డే, అల్లు శిరీష్‌, క్రికెటర్ యువరాజ్ సింగ్‌లకు నోటీసులు ఇచ్చారు. వారం రోజుల్లో విచారణకు హాజరుకావాలని ఆదేశించారు. విచారణకు హాజరుకాకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సైబరాబాద్ పోలీసులు హెచ్చరించారు.

వీరంతా క్యూనెట్ కంపెనీ తరుఫున బ్రాండ్ అంబాసిడర్లుగా వ్యవహరించారు. కంపెనీ యాడ్స్‌లో నటించారు. ఆ కంపెనీకి పబ్లిసిటీ చేశారు. ఈ ప్రకటనలు చూసి తాము క్యూనెట్‌లో పెట్టుబడులు పెట్టి మోసపోయాని చాలామంది బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదులతో పోలీసులు ప్రముఖులకు నోటీసులు ఇచ్చారు. మల్టీలెవల్ మార్కెటింగ్ పేరుతో అమాయకుల నుంచి వేల కోట్ల రూపాయలు దోచుకున్న క్యూనెట్ కేసు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ కేసులో ఫిర్యాదులు అందటంతో సైబరాబాద్ పోలీసులు దర్యాఫ్తుని ముమ్మరం చేశారు.

క్యూనెట్ బ్రాండ్ పేరుతో దేశంలోని వివిధ ప్రాంతాల్లో గొలుసుకట్టు వ్యాపారం నిర్వహిస్తూ లక్షల మందిని ముంచారు. ఇది వెయ్యి కోట్ల రూపాయల కుంభకోణం. 14 కేసులకు సంబంధించి మొత్తం 58 మందిని అదుపులోకి తీసుకున్నారు. విజయ్ ఈశ్వరన్, జోసఫ్ బిస్మార్క్ 1998లో హాంగ్‌కాంగ్, మలేషియా కేంద్రంగా క్యూవన్ గ్రూఫ్ ఆఫ్ కంపెనీ పేరుతో వ్యాపారం ప్రారంభించి నష్టపోయారు. వారు 2001లో భారత్‌కు వచ్చి గోల్డ్‌క్వెస్ట్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ పేరుతో బంగారు కాయిన్ల వ్యాపారం ప్రారంభించారు.

2004లో క్వెస్ట్‌నెట్ ఎంటర్‌ప్రైజెస్ పేరుతో గోల్డ్ కాయిన్స్, బయోడిస్క్, వాచ్‌లు, హాలిడే ట్రిప్స్ వంటి కార్యకలాపాలు నిర్వహించారు. భారత్‌తోపాటు మలేషియా, కంబోడియా, టర్కీ, సౌదీ అరేబియా, రష్యా తదితర దేశాల్లో గొలుసుకట్టు వ్యాపారాలు ప్రారంభించి అమాయకుల నుంచి డబ్బు దండుకున్నారు. 2010లో భారత కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ వీరి కంపెనీలపై విచారణకు ఆదేశించడంతో కార్యకలాపాలు స్తంభించాయి. విజయ్ ఈశ్వరన్, జోసఫ్ బిస్మార్క్ మళ్లీ 2011లో విహాన్ డైరెక్ట్ సెల్లింగ్ ఇండియా కంపెనీని ప్రారంభించి క్యూనెట్ బ్రాండ్ పేరుతో వ్యాపార, ఆరోగ్య, అభరణాల ఉత్పత్తి, విహార యాత్రలు, విద్యాపరమైన ప్యాకేజీలతో గొలుసుకట్టు వ్యాపారానికి తెరలేపారు.

వీరు పక్కా ప్రణాళికతో నిరుద్యోగులకు గాలం వేస్తారు. ఒకసారి పెట్టుబడి పెడితే ప్రతినెలా డబ్బు వస్తాయని, రెండు మూడేళ్లలో కోటీశ్వరులు కావొచ్చని నమ్మించి రూ.లక్షలు కట్టించుకుంటారు. యూజర్ ఐడీ, పాస్‌వర్డ్ ఇస్తారు. 2,3 నెలలు తిప్పించుకున్న తర్వాత గొలుసుకట్టు వ్యాపారాన్ని తెరమీదకి తెస్తారు. మీ స్నేహితులు, బంధువులను కనీసం ఇద్దరిని చేర్పించి, ఉత్పత్తులు అమ్మితేనే మీ డబ్బు తిరిగొస్తుందని చెప్తారు. ఇలా తెలంగాణ, ఏపీతోపాటు మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో లక్షల మందిని మోసం చేశారు. రూ.వెయ్యి కోట్లకుపైగా వసూలు చేశారు.