Railway Jobs Cheating : రైల్వే ఉద్యోగాల పేరుతో కోటి రూపాయల మోసం-ఇద్దరు అరెస్ట్

రైల్వేలో ఉద్యోగాల పేరుతో మోసాలు చేస్తున్న ఇద్దరు నిందితులను రాచకొండ పోలీసులుఅరెస్టు చేశారు. మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య అన్న కొడుకు పొన్నాల భాస్కర్, మరోక వ్యక్తిని అరెస్ట్ చేసినట

Railway Jobs Cheating : రైల్వే ఉద్యోగాల పేరుతో కోటి రూపాయల మోసం-ఇద్దరు అరెస్ట్

Railway Jobs Cheaating

Railway Jobs Cheating :  రైల్వేలో ఉద్యోగాల పేరుతో మోసాలు చేస్తున్న ఇద్దరు నిందితులను రాచకొండ పోలీసులుఅరెస్టు చేశారు. మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య అన్న కొడుకు పొన్నాల భాస్కర్, మరోక వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు పోలీసు కమీషనర్ మహేష్ భగవత్ తెలిపారు.

రైల్వేలో టికెట్ కలెక్టర్, కమర్షియల్ క్లర్క్ జాబ్ ఇప్పిస్తామని 16 మంది వద్దనుంచి దాదాపు కోటిరూపాయలు వసూలు చేశారు నిందితులు. నిరుద్యోగులకు అపాయింట్ మెంట్ లెటర్లు, ఐడీ కార్డులు కూడా జారీ చేశారు. అవి తీసుకుని రైల్వే ఆఫీసుకు వెళ్లిన నిరుద్యోగులకు చుక్కెదురయ్యింది. అవి నకిలీ నియామక పత్రాలని తేలటంతో మోసపోయామని బాధితులు గ్రహించారు.

ఉద్యోగాలు ఇప్పిస్తాననటంతో అప్పులు తెచ్చి, ఇంట్లో బంగారం అమ్మి డబ్బులు కట్టినట్లు బాధితులు చెప్పారు. డబ్బులు తిరిగి ఇవ్వాలని బాధితులు కోరగా…డబ్బులు ఇస్తానని చెప్పి బాధితులను ముంబై తీసుకువెళ్లిన భాస్కర్ బాధితులను బెదిరించాడు.
Also Read : Chhattisgarh : మందుపాతర పేల్చిన మావోయిస్టులు
దీంతో బాధితులు తిరిగి వచ్చి రాచకొండ పోలీసులకు ఫిర్యాదు చేయటంతో పోలీసులు పొన్నాల భాస్కర్, మరోక నిందితుడిని అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ.10 లక్షల నగదు నకిలీ రైల్వే ఐడి కార్డ్, డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు నిందితులను రిమాండ్‌కు తరలించారు.