Raj Kundra Bail Petition : నా క్లయింట్ టెర్రరిస్ట్ కాదు….రాజ్‌కుంద్రా బెయిల్ పిటీషన్ తిరస్కరణ

పోర్న్ చిత్రాల నిర్మాణం కేసులో అరెస్టైన ప్రముఖ వ్యాపార వేత్త, హీరోయిన్ శిల్పాశెట్టి భర్త రాజ్‌కుంద్రా, అతని సహాయకుడు ర్యాన్ తోర్పే బెయిల్ పిటీషన్‌ను ముంబై హైకోర్టు తిరస్కరించింది.

Raj Kundra Bail Petition : నా క్లయింట్ టెర్రరిస్ట్ కాదు….రాజ్‌కుంద్రా బెయిల్ పిటీషన్ తిరస్కరణ

Raj Kundra Bail Petition

Raj Kundra Bail Petition : పోర్న్ చిత్రాల నిర్మాణం కేసులో అరెస్టైన ప్రముఖ వ్యాపార వేత్త, హీరోయిన్ శిల్పాశెట్టి భర్త రాజ్‌కుంద్రా, అతని సహాయకుడు ర్యాన్ తోర్పే బెయిల్ పిటీషన్‌ను ముంబై హైకోర్టు తిరస్కరించింది. ఈ రోజు బెయిల్ పిటీషన్ పై   హైకోర్టులో విచారణ జరిగింది.  తన అరెస్ట్ చట్ట విరుధ్దం అని, తనను వెంటనే విడుదల చేయాలని కోరుతూ రాజ్ కుంద్రా పిటీషన్ వేశారు. తన క్లయింట్ ఉగ్రవాది కాదని..అతనికి బెయిల్ ఇవ్వాలని విచారణ సందర్భంగా రాజ్‌కుంద్రా తరుఫు న్యాయవాది వాదనలు వినిపించారు. కేసును కోర్టు రేపటికి వాయిదా వేసింది.

గత సోమవారం జులై 19న రాజ్ కుంద్రాను  పోలీసులు అరెస్ట్ చేశారు.  14 రోజుల రిమాండ్ విధించటంతో ముంబై లోని ఆర్థర్ రోడ్ జైలులో రాజ్‌కుంద్రా జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. ఆ మర్నాడు అతని సహాయకుడు పోర్న్ యాప్ టెక్నికల్ వ్యవహారాలు చూసుకునే ర్యాన్ థోర్ప్ అరెస్టయ్యాడు. ఈకేసులో అతని వద్ద పనిచేసే నలుగురు ఉద్యోగులు సాక్ష్యులుగా మారారని పోలీసులు తెలిపారు.

రాజ్ కుంద్రా వివాదస్పద యాప్ హాట్‌షాట్ పై కేసు దర్యాప్తు దశలో ఉందని.. గూగుల్ ప్లే స్టోర్, యాపిల్ స్టోర్ నుంచి యాప్ ను తొలగించారని పోలీసులు తెలిపారు. ఆ యాప్ స్ధానంలో బాలీఫేమ్ అనే యాప్ ను లాంచ్ చేసినట్లు పోలీసులు కోర్టుకు ఇచ్చిన నివేదికలో తెలిపారు.

హాట్ షాట్ యాప్ లో అప్ లోడ్ చేసిన కంటెంట్ బోల్డ్ కంటెంట్ మాత్రమే అని అది పోర్న్ కాదని కుంద్రా వాదిస్తున్నారు. కేసు  విచారణలో భాగంగా కుంద్రా భార్య ప్రముఖ నటి శిల్పాశెట్టిని పోలీసులు ప్రశ్నించినప్పుడు హాట్ షాట్ యాప్ లో కంటెంట్ గురించి తనకు తెలియదని ఆమె చెప్పుకొచ్చారు. శృంగారానికి, అశ్లీలతకు చాలా తేడా ఉందని శిల్పాశెట్టి పోలీసు విచారణలో వెల్లడించినట్లు తెలిసింది.