Raj Kundra Case : పోర్న్ వీడియోల గురించి చట్టాల్లో ఏమి ఉంది…చూడటం, నిర్మించటం ? నేరమా

ప్రముఖ వ్యాపార వేత్త, బాలీవుడ్ న‌టి శిల్పాశెట్టి భ‌ర్త  రాజ్‌కుంద్రా ను పోర్న్ వీడియోలు తీశాడనే కేసులో పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.  త‌మ‌తో రాజ్ కుంద్రా అశ్లీల చిత్రాలు తీశాడని పలువురు నటీమణులు చేసిన ఫిర్యాదుతో ముంబై పోలీసులు సుమారు 5 నెలలు పాటు సాక్ష్యాలు సేకరించి అతడ్ని అరెస్ట్ చేశారు.

Raj Kundra Case : పోర్న్ వీడియోల గురించి చట్టాల్లో  ఏమి ఉంది…చూడటం, నిర్మించటం ? నేరమా

Raj Kundra Case

Raj Kundra Case : ప్రముఖ వ్యాపార వేత్త, బాలీవుడ్ న‌టి శిల్పాశెట్టి భ‌ర్త  రాజ్‌కుంద్రా ను పోర్న్ వీడియోలు తీశాడనే కేసులో పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.  త‌మ‌తో రాజ్ కుంద్రా అశ్లీల చిత్రాలు తీశాడని పలువురు నటీమణులు చేసిన ఫిర్యాదుతో ముంబై పోలీసులు సుమారు 5 నెలలు పాటు సాక్ష్యాలు సేకరించి అతడ్ని అరెస్ట్ చేశారు. ప్రస్తుతం రాజ్ కుంద్రా పోలీసు కస్టడీలో ఉన్నాడు. అసలు పోర్నోగ్ర‌ఫీ గురించి భార‌త చ‌ట్టాలు ఏం చెబుతున్నాయి?  అశ్లీల వీడియోలు తీయ‌డం, చూడ‌టం చ‌ట్ట ప్ర‌కారం నేర‌మా?  రాజ్ కుంద్రా పై నేరం రుజువైతే ఎన్నేళ్లు జైలు శిక్ష ప‌డ‌ుతుంది?  చ‌ట్టం ఏం చెబుతోంది?  ఒకసారి చూద్దాం.

వాస్తవానికి రాజ్ కుంద్రా అశ్లీల చిత్రాలను  యాప్ లలో అప్‌లోడ్  చేసి ప్రసారం చేసిన సంస్ధ యూకేలో ఉంది.  ఈ విషయంలో యూకే లోని చట్టాలకు భారత చట్టాలకు చాలా తేడా ఉంది.  భారత చట్టాలు అశ్లీల చిత్రాల విషయంలో చాలా కఠినంగా ఉన్నాయి.  కాకపోతే   పోర్నోగ్రఫీ  చూడటం   ఏదేశంలోనూ చట్టవిరుధ్ధం కానప్పటికీ… దాన్ని నిర్మించటం, పంపిణీ చేయటంపై రెండు దేశాలలోనూ చట్టవిరుధ్దం.  పైగా వాటిలో మ‌హిళ‌లు, చిన్న పిల్ల‌లు క‌నుక ఉంటే వేరే సెక్ష‌న్ల కింద కూడా కేసులు న‌మోద‌వుతాయి. అవి మరింత కఠినంగా ఉంటాయి.

భారత్ లో ఉన్న చట్టాల గురించి ఒకసారి చూస్తే పోర్నోగ్రఫీ కి సంబంధించి ఐపీసీ లో మూడు సెక్ష‌న్లు ఉన్నాయి. 292, 293, 294. అంతేకాదు ఇన్ఫ‌ర్మేష‌న్ టెక్నాల‌జీ చ‌ట్టం 2000లోని సెక్ష‌న్ 67ఎ కూడా అశ్లీల చిత్రాల‌కు సంబంధించిన‌దే.  అయితే ఈ చ‌ట్టం ప్ర‌కారం ఇండియాలో పోర్న్ లేదా అశ్లీల కంటెంట్‌ను చూడ‌టం, చ‌ద‌వ‌డం నేరం కాదు. 2015 జులైలో సుప్రీంకోర్టు చెప్పిన దాని ప్ర‌కారం.. ఇంట్లో నాలుగు గోడ‌ల మ‌ధ్య పోర్న్ చూడ‌టం అనేది చ‌ట్ట‌బ‌ద్ధ‌మే. ఇది నేరం కింద ప‌రిగ‌ణించ‌కూడ‌దు. కానీ ఆ వీడియోల‌ను తీయ‌డం, ప్ర‌చారం చేయ‌డం, పంపిణీ చేయ‌డం మాత్రం నేరంగా ప‌రిగ‌ణిస్తారు.

ఈ  సెక్షన్ల గురించి స్ధూలంగా చెప్పుకోవాలంటే సెక్షన్ 292 అనేది అశ్లీలం అంటే ఏంటో వివ‌రిస్తుంది. ఈ సెక్ష‌న్ ప్ర‌కారం వీటిని తయారు చేయ‌డం, డిస్ట్రిబ్యూషన్ చేయ‌డం నేరంగా ప‌రిగ‌ణిస్తూ తొలిసారి అయితే మూడేళ్ల జైలు శిక్ష‌, రెండోసారి అయితే ఐదేళ్ల జైలు శిక్ష విధిస్తారు.  ఇక సెక్ష‌న్ 293 అనేది ఇలాంటి అశ్లీల వీడియోలు తీయ‌డం వాటిని 20 ఏళ్ల‌లోపు యువ‌త‌కు పంపిణీ చేయ‌డానికి సంబంధించిన‌ది.  ఇక సెక్ష‌న్ 294 అనేది ప‌బ్లిగ్గా త‌మ చ‌ర్య‌లు, పాటల ద్వారా అశ్లీలాన్ని ప్ర‌ద‌ర్శించ‌డం గురించి చెబుతోంది. బ‌హిరంగ ప్ర‌దేశాల్లో అశ్లీల పాట‌లు పాడ‌టం, ఉచ్ఛ‌రించ‌డం అనేది నేరంగా ప‌రిగ‌ణిస్తోంది. ప్ర‌స్తుతం రాజ్‌కుంద్రాపై ఈ మూడు సెక్ష‌న్ల కింద ముంబై పోలీసులు  కేసులు  న‌మోదుచేశారు.

ఒక వేళ ఈ చిత్రాలలో మ‌హిళ‌లు, చిన్న పిల్ల‌లు క‌నుక ఉంటే   వేరే సెక్ష‌న్ల కింద కూడా కేసులు న‌మోద‌వుతాయి.  పిల్ల‌ల విష‌యంలో ప్రొటెక్ష‌న్ ఆఫ్ చిల్డ్ర‌న్ ఫ్ర‌మ్ సెక్సువ‌ల్ అఫెన్సెస్ (పోక్సో) చ‌ట్టం, 2012 కింద కేసు న‌మోదు చేస్తారు. ఈ చ‌ట్టంలోని సెక్ష‌న్ 14 ప్ర‌కారం పోర్నోగ్ర‌ఫీలో   పిల్ల‌ల‌ను భాగం చేయ‌డం నేరం.  ఇక మ‌హిళ‌ల విష‌యంలో   ఇన్‌డీసెంట్ రిప్ర‌జెంటేష‌న్ ఆప్ విమెన్  (ప్రొహిబిష‌న్) చ‌ట్టం ప్ర‌కారం కేసు నమోదు చేస్తారు. రాజ్‌కుంద్రాపై ఈ చ‌ట్టంలోని సెక్ష‌న్ 3, 4, 6, 7 కింద కూడా కేసులు న‌మోద‌య్యాయి.

ఇది కాక ఐటీ చ‌ట్టం  సెక్ష‌న్ 67ఎ గురించి చూద్దాం.. పోర్నోగ్ర‌ఫీ విష‌యంలో ఐటీ చ‌ట్టంలోని సెక్ష‌న్ 67ఎను కూడా ప్ర‌యోగిస్తారు. అశ్లీల కంటెంట్‌ను ఎల‌క్ట్రానిక్ రూపంలో ప‌బ్లిష్ చేయ‌డం, షేర్ చేయ‌డం అనేది ఈ సెక్ష‌న్‌ కింద నేరం. ఈ సెక్ష‌న్ కింద గ‌రిష్ఠంగా  ఐదేళ్ల జైలు శిక్ష‌, రూ.10 ల‌క్ష‌ల వ‌రకూ జ‌రిమానా విధిస్తారు. రెండోసారి నేరం చేస్తే ఏడేళ్ల వ‌ర‌కూ జైలు శిక్ష విధించ‌వ‌చ్చు.

కాగా .. ఇండియన్ యూకే చట్టాలు పోర్నో గ్రఫీలో పూర్తి భిన్నాంగా ఉంటాయి. 2021 లో అక్కడి లా కమీషన్ విడుదల చేసిన వివరాల ప్రకారం ఇంగ్లాండ్ వేల్స్ లలో ఏ ఒక్క నేరపూరిత నేరం లేదు. కాగా స్మార్ట్ ఫోన్ల వాడకం పెరగటం వలన కూడా పోర్నోగ్రఫీ వాడకం పెరిగిందని పేర్కోంది. యూకే లో పోర్నోగ్రఫీని అడ్డుకోటానికి ఉన్న చట్టాలు రెండే రెండు అవి 1959, 1964 నాటి చట్టాలు. మునుపటి చట్టాలు నేటి అత్యాధునిక ఇంటర్నెట్ వినియోగానికి సంబంధించిన నేరాలను కవర్ చేయనందున అలాంటి సమస్యలను పరిష్కరించటానికి యూకే క్రిమినల్ జస్టిస్ అండ్ పబ్లిక్ ఆర్డర్ యాక్ట్ 1994 (CJ POA 1994) ను ప్రవేశపెట్టింది.

కాగా 2015 లో యూకే ప్రభుత్వం ప్రభుత్వం క్రిమినల్ జస్టిస్ అండ్ కోర్ట్స్ యాక్ట్, 2015 ను తీసుకువచ్చింది. దీని ప్రకారం అందులో పోర్న్ చిత్రాల్లో నటించే నటీ నటుల ఇష్టంలేకుండా వారికి సంబంధించిన ఫోటోలు వీడియోలు పబ్లిష్ చేయటం, వీడియోలు ప్రసారం చేయటం నేరం కిందకు వస్తుంది.  ఏది ఏమైనా ముంబై పోలీసులు ఫిబ్రవరిలో కేసు నమోదైనా పూర్తి స్ధాయిలో పకడ్బందీగా రాజ్ కుంద్రా మీద బలమైన సాక్ష్యాధారాలు సేకరించిన అనంతరమే అరెస్టు చేశారు.