Raj Kundra Apps : అశ్లీల చిత్రాల కోసం ఐబీ అధికారి భార్య పేరుతో యాప్

పోర్న్ వీడియోలు తీసిన కేసులో అరెస్టైన ప్రముఖ వ్యాపార వేత్త, సినీనటిశిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రా కేసు విచారణలో షాకింగ్ విషయాలు వెలుగు చూస్తున్నాయి. 

Raj Kundra Apps : అశ్లీల చిత్రాల కోసం ఐబీ అధికారి భార్య పేరుతో యాప్

Rajkundra Porn Apps

Raj Kundra Apps : పోర్న్ వీడియోలు తీసిన కేసులో అరెస్టైన ప్రముఖ వ్యాపార వేత్త, సినీనటిశిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రా కేసు విచారణలో షాకింగ్ విషయాలు వెలుగు చూస్తున్నాయి.  పోర్న్ చిత్రాల ప్రసారానికి ఏర్పాటు చేసిన హాట్ షాట్స్ యాప్ ను గూగుల్ ప్లే స్టోర్, యాపిల్ యాప్ స్టోర్ లోంచి తొలగించటానికి ప్లాన్-బీ ని అమలు చేసినట్లు తెలుస్తోంది.  బాలీఫేమ్‌ పేరుతో మరో యాప్‌ను ఏర్పాటు చేసి వ్యాపారం కొనసాగించారని పోలీసులు తెలిపారు.

ఇందుకోసం రాజ్ కుంద్రా ఏకంగా ఇంటిలిజెన్స్ బ్యూరోకు  చెందిన ఒక అధికారిని అతడికి తెలియకుండానే ఇందులో భాగస్వామిని  చేసినట్లు కనుగొన్నారు. ప్రస్తుతం పరారీలో ఉన్న కుంద్రా సన్నిహితుడు యష్ ఠాకూర్ ముందస్తు ప్రణాళికతోనే ఆ అధికారితో పరిచయం పెంచుకున్నట్లు తెలిసింది. అతడ్ని భాగస్వామిని చేయటానికి ముందు …అవార్డు గెలుచుకున్న షార్ట్ ఫిలింస్ ను ప్రసారం చేయటానికి యాప్ ఏర్పాటు చేద్దామని చెప్పి ఆ అధికారి వద్ద యాష్ ఠాకుర్ చెప్పినట్లు తెలిసింది.

అందుకు అంగీకరించిన  సదరు అధికారి తన భార్య పేరు  మీద బాలీఫేమ్ అనే  యాప్‌ను  రిజిష్టర్ చేశాడు. తర్వాతి కాలంలో యాప్‌లో  అశ్లీల చిత్రాల కంటెంట్‌ను   అప్‌లోడ్ చేయటం  చూసి  అభ్యంతరం చెప్పినట్లు తెలిసింది. కుంద్రా అరెస్టైన మరుసటి రోజే యాప్ నుంచి ఆ చిత్రాలను తొలగించమని ఆ అధికారి తమకు చెప్పినట్లు రాజ్‌కుంద్రా  కేసులో సాక్షులుగా మారిన,  ఆ సంస్ధలో పని చేసే నలుగురు ఉద్యోగులు చెప్పారని పోలీసులు తెలిపారు. కేసులో విచారణలో భాగంగా  నటి షెర్లిన్ చోప్రాను  పోలీసులు  ఈరోజు విచారించే అవకాశం ఉంది.