నకిలీ నోట్ల కలకలం : రూ.4కోట్ల ఫేక్ కరెన్సీ పట్టివేత

రాజస్తాన్ లో దొంగ నోట్ల కలకలం చెలరేగింది. పెద్ద మొత్తంలో నకిలీ నోట్లు మార్కెట్ లో చలామనీ చేసే గ్యాంగ్ గుట్టు రట్టయింది. పోలీసుల సీక్రెట్ ఆపరేషన్ ద్వారా గ్యాంగ్ ని

  • Published By: veegamteam ,Published On : September 19, 2019 / 03:11 AM IST
నకిలీ నోట్ల కలకలం : రూ.4కోట్ల ఫేక్ కరెన్సీ పట్టివేత

రాజస్తాన్ లో దొంగ నోట్ల కలకలం చెలరేగింది. పెద్ద మొత్తంలో నకిలీ నోట్లు మార్కెట్ లో చలామనీ చేసే గ్యాంగ్ గుట్టు రట్టయింది. పోలీసుల సీక్రెట్ ఆపరేషన్ ద్వారా గ్యాంగ్ ని

రాజస్తాన్ లో దొంగ నోట్ల కలకలం చెలరేగింది. పెద్ద మొత్తంలో నకిలీ నోట్లు మార్కెట్ లో చలామనీ చేసే గ్యాంగ్ గుట్టు రట్టయింది. పోలీసుల సీక్రెట్ ఆపరేషన్ ద్వారా గ్యాంగ్ ని పట్టుకున్నారు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 4 కోట్ల రూపాయల దొంగ నోట్లు పట్టుకున్నారు పోలీసులు. ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసిన పోలీసులు వారి నుంచి నగదుని స్వాధీనం చేసుకున్నారు. 

ఇద్దరి నుంచి రూ.4.77 కోట్ల నకిలీ నోట్లు స్వాధీనం చేసుకున్నారు. రాజస్థాన్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్ మెంట్(సీఐడీ) వింగ్ అధికారులు బుధవారం(సెప్టెంబర్ 19,2019) కేమ్ చంద్(39), రాజేష్ బంకర్(19) లని అరెస్ట్ చేశారు. వారి నుంచి ఫేక్ కరెన్సీతో పాటు బొమ్మ తుపాకీ స్వాధీనం చేసుకున్నారు. బొమ్మ తుపాకీతో ప్రజలను భయపెట్టేవారిని పోలీసులు తెలిపారు. ఏటీఎం కార్డులు, ఫేక్ సీల్స్, మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. దొంగ నోట్లతో ప్రజలను మోసం చేసినట్లు వారిద్దరూ విచారణలో అంగీకరించారని పోలీసులు వెల్లడించారు.

ఈ ఇద్దరు మరో కేసులో వాంటెడ్ గా ఉన్నారని పోలీసులు చెప్పారు. ఏటీఎం దొంగతనం కేసులో పోలీసులు వారి కోసం గాలిస్తున్నారు. సీఐడీ టీమ్ ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించి గ్యాంగ్ ని పట్టుకుందని క్రైమ్ ఏడీజీ సోనీ తెలిపారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేపట్టారు. అసలు దొంగ నోట్లు ఎక్కడ ప్రింట్ చేస్తున్నారు? ఎక్కడికి తరలించారు? ఎక్కడ చలామణి చేశారు? ఇంకా ఆ గ్యాంగ్ లో ఎంతమంది మెంబర్స్ ఉన్నారు? ఇలాంటి వివరాలు తెలుసుకునే పనిలో పోలీసులు ఉన్నారు. కాగా భారీ మొత్తంలో నకిలీ నోట్లు పట్టుబడటం స్థానికంగా సంచలనం రేపింది. ప్రజల్లో ఆందోళన నింపింది. తమ జేబులో ఉన్న నోట్లు ఒరిజినలా కాదా అనే సందేహిస్తున్నారు.