ముస్లిం గర్భిణీని హాస్పిటల్లో చేర్చుకోవడానికి నిరాకరించిన డాక్టర్, శిశువు మృతి

ముస్లిం గర్భిణీని హాస్పిటల్లో చేర్చుకోవడానికి నిరాకరించిన డాక్టర్, శిశువు మృతి

రాజస్థాన్‌లోని భరత్‌పూర్‌ ప్రాంతానికి చెందిన గవర్నమెంట్ హాస్పిటల్ లో ముస్లిం మతస్థురాలనే సాకుతో హాస్పిటల్లో చేర్పించుకునేందుకు నిరాకరించారు. సకాలంలో వైద్య సదుపాయం అందక శిశువు మరణించింది. డాక్టర్ చాదస్తం కారణంగానే ఇది జరిగిందంటూ పలువురు ఈ ఉదంతంపై విమర్శలు గుప్పిస్తున్నారు. బాధితురాలి భర్త ఆవేదనతో మీడియాతో ఇలా అంటున్నాడు. 

‘గర్భిణీ అయిన నా భార్య ప్రసవ సమయం కావడంతో సిక్రీ డాక్టర్ జనన హాస్పిటల్ కు రిఫర్ చేశారు. కానీ, ఇక్కడ డాక్టర్లు మీరు ముస్లింలు కాబట్టి జిల్లా హెడ్ క్వార్టర్ అయిన జైపూర్ లోని హాస్పిటల్లో చూపించుకోవాలని అన్నారు. అంబులెన్స్ లో తీసుకెళ్తుంటే మార్గం మధ్యలోనే ప్రసవించింది. కానీ, సకాలంలో చికిత్స అందక శిశువు మరణించింది. దీనంతటికీ కారణం అడ్మినిస్ట్రేషనే’ అని మహిళ భర్త ఆరోపిస్తున్నారు. 

జనన హాస్పిటల్ ప్రిన్సిపాల్ డా.రూపేందర్ ఝా మాట్లాడుతూ.. మహిళ సీరియస్ గా ఉన్న సమయంలో డెలివరీ కోసం వచ్చింది. అందుకే జైపూర్ హాస్పిటల్ కు వెళ్లాలని చెప్పాం. అసలెందుకిలా జరిగిందో తెలుసుకోవాలని దర్యాప్తు జరుపుతున్నామని అన్నారు. 

రాజస్థాన్ పర్యాటక శాఖ మంత్రి విశ్వేంద్ర సింగ్.. ట్రీట్‌మెంట్‌కు  నిరాకరించిన డాక్టర్ ను నిందించారు. భరత్ పూర్ లో పరిస్థితి ఇంత దారుణంగా ఉంది.  అక్కడ ఆరోగ్య శాఖ మంత్రి ఆ ప్రాంతానికి చెందిన ఎమ్మెల్యేనే. మతపరమైన వివక్ష చూపుతూ ట్రీట్ మెంట్ కు నిరాకరించారు’ అని ట్విట్టర్ వీడియో ద్వారా అభిప్రాయపడ్డారు. 

ఇంతకంటే సిగ్గుపడటానికి మరేం లేదు. ఇది సెక్యూలర్ దేశం. ఇటువంటి అంశాలపై ప్రభుత్వం మరింత సెన్సిటివ్ గా వ్యవహరించాలి. తబ్లిగీ జమాత్ ను కరోనా వైరస్ తో ముడిపెడుతున్నారు. దేశమంతా వైరస్ ఉందని మహిళపై అనుమానంతో డెలీవరీకి నిరాకరించకూడదు. ఈ విషయాన్ని అక్కడి లోకల్ ఎమ్మెల్యే, రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి పట్టించుకోవాలని అన్నారు. (ఏపీలో కరోనా : 12 గంటలు..14 కొత్త కేసులు..)