Rajasthan: కూతురుకు రెండో పెళ్లి చేసినందుకు తండ్రి చెవులు, ముక్కు కోసిన బంధువులు

రాజస్థాన్‌లో దారుణ ఘటన జరిగింది. ఒక వ్యక్తి తన కూతురుకు రెండో పెళ్లి చేసినందుకు, ఆమె మొదటి భర్త బంధువులు ఆ తండ్రి చెవులు, ముక్కు కోసేశారు. ప్రస్తుతం బాధితుడి పరిస్థితి విషమంగా ఉంది.

Rajasthan: కూతురుకు రెండో పెళ్లి చేసినందుకు తండ్రి చెవులు, ముక్కు కోసిన బంధువులు

Rajasthan: రాజస్థాన్‌లో దారుణం జరిగింది. భర్త నుంచి విడాకులు తీసుకున్న కూతురుకు రెండో పెళ్లి చేసినందుకు ఆమె తండ్రి చెవులు, ముక్కు కోసేశారు బంధువులు. ఈ ఘటన రాజస్థాన్, బర్మార్ జిల్లా ఆదర్శ్ సోండి గ్రామంలో మంగళవారం రాత్రి జరిగింది.

AP Assembly Session: రేపటి నుంచే ఏపీ అసెంబ్లీ సమావేశాలు.. రాజధాని అంశంపైనే ప్రధాన చర్చ

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆదర్శ్ సోండి గ్రామానికి చెందిన సుఖ్‌రామ్ బిష్ణోయ్ కూతురుకు, సమీప గ్రామానికి చెందిన ఒక వ్యక్తితో ఆరేళ్లక్రితం వివాహమైంది. అయితే, మనస్పర్ధల కారణంగా బిష్ణోయ్ కూతురు ఏడాది క్రితం భర్త నుంచి విడాకులు తీసుకుంది. ఈ నేపథ్యంలో తన ఇంట్లోనే ఉంటున్న కూతురుకు ఇటీవలే బిష్ణోయ్ రెండో పెళ్లి చేశాడు. దీంతో కోపం తెచ్చుకున్న ఆమె మొదటి భర్త బంధువులు బిష్ణోయ్ ఇంట్లోకి ప్రవేశించి అతడిపై దాడికి పాల్పడ్డారు. చెవులు, ముక్కు కోసేశారు. కాలు విరగ్గొట్టారు. తర్వాత అతడి చెవుల్ని, ముక్కును తమ వెంట తీసుకుని వెళ్లిపోయారు. వెంటనే బిష్ణోయ్‌ను బంధువులు ఆస్పత్రికి తరలించారు.

Congress Collapses In Goa: గోవాలో కాంగ్రెస్ పార్టీకి షాక్.. బీజేపీలో చేరిన 8 మంది ఎమ్మెల్యేలు

జోధ్‌పూర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బిష్ణోయ్ పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. గత నెల 10న కూడా ఇదే బర్మార్ జిల్లాలో ఇలాంటి ఘటనే జరిగింది. ఎంగేజ్‌మెంట్ తర్వాత ఒక వ్యక్తి తన కూతురు పెళ్లి రద్దు చేయడంతో, వరుడి తరఫు బంధువులు ఆ తండ్రి ముక్కు కోసేశారు.