గ్యాస్ స్టవ్ మీద రూ.20 లక్షలు తగలబెట్టిన తహసీల్దార్ | Rajasthan Tahsildar burns Rs 20 Lakh as ACB visits over briery allegations Sirohi District

Tahsildar burns Rs.20 Lakh : గ్యాస్ స్టవ్ మీద రూ.20 లక్షలు తగలబెట్టిన తహసీల్దార్

ఏసీబీ అధికారులు తనిఖీలు చేయటానికి వస్తున్నరనితెలిసి అక్రమంగా సంపాదించిన రూ. 20లక్షల ను గ్యాస్ స్టవ్ వెలిగించి తగలబెట్టిన తహసీల్దార్ ఉదంతం రాజస్ధాన్ లో వెలుగు చూసింది.

Tahsildar burns Rs.20 Lakh : గ్యాస్ స్టవ్ మీద రూ.20 లక్షలు తగలబెట్టిన తహసీల్దార్

Rajasthan Tahsildar burns Rs 20 Lakh as ACB visits over briery allegations Sirohi District : ప్రభుత్వ ఉద్యోగం అంటేనే లంచాలు తీసుకుని రెండు చేతులా సంపాదించవచ్చనే భ్రమలో ఉన్నారు. ఉన్న ప్రభుత్వోద్యోగుల్లో సింహభాగం అలాగే సంపాదిస్తున్నారు కూడా.

అక్రమంగా డబ్బుసంపాదిస్తున్నాడని ఒక తహసిల్దార్ పై ఆరోపణలు వచ్చాయి. ఏసీబీ అధికారులు తనిఖీలు చేయటానికి వస్తున్నరని  తెలిసి అక్రమంగా సంపాదించిన రూ. 20లక్షల ను గ్యాస్ స్టవ్ వెలిగించితగలబెట్టినతహసీల్దార్ ఉదంతం రాజస్ధాన్ లో వెలుగు చూసింది.

రాజస్ధాన్ లోని సిరోహి జిల్లాలో ఒక వ్యక్తి నుంచి లక్ష రూపాయలు లంచం తీసుకుంటున్న రెవెన్యూ ఇన్స్ పెక్టర్ పర్వత్ సింగ్ ను ఏసీబీ అధికారులు బుధవారం రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఇందులో తన ప్రమేయం ఏమీ లేదని, ఇదంతా తాహసీల్దార్ కల్పేశ్ కుమార్ జైన్ ఆదేశాల మేరకే తాను డబ్బులు వసూలు చేస్తున్నానని ఇదంతా ఆయనకే ఇచ్చేస్తానని చెప్పాడు.

పర్వత్ ను వెంటబెట్టుకుని ఏసీబీ అధికారులు కల్పేష్ ఇంటికి బయలు దేరారు. ఈ సమాచారం కొందరి ద్వారా కల్పేష్ కు తెలిసి పోయింది. ఏసీబీ అధికారులు తన ఇంటికి వచ్చే లోపు … ఇంటి తలుపులు, కిటికీలు మొత్తం మూసి వేశాడు. గ్యాస్ పొయ్యి వెలిగించి ఇంట్లోఉన్న నోట్ల కట్టలను గ్యాస్ పొయ్యి మీద పెట్టి కాల్చటం మొదలెట్టాడు. అధికారులు ఇంటికి చేరుకున్నారు.

తలుపులుకొట్టినా కల్పేష్ తీయలేదు. బలవంతంగా ఒక కిటీకి తలుపు తెరిచి చూడగా కల్పేష్ అతని భార్య వంటింట్లో , గ్యాస్ స్టవ్ మీద నోట్ల కట్టలను తగలబెట్టటం చూసారు. అలా చేయొద్దని వారించారు. అయినా అతను వినలేదు. తనపని తాను చేసుకుంటూ పోతూనే ఉన్నారు.

ఇక లాభం లేదనుకున్న అధికారులు బలవంతంగా ఇంటి తలుపులు తెరిచి లోపలకు ప్రవేశించారు. అప్పటికే కల్పేష్ రూ. 20లక్షల విలువైన నోట్లను కాల్చి వేశాడు. ఏసీబీ అధికారులు కల్పేష్ ను అరెస్ట్ చేశారు. మిగిలిఉన్న రూ.1.5 లక్షలను అతడి నుంచి స్వాధీనం చేసుకున్నారు.

Video Courtesy : The Pink City Post

×