Rajasthan : ఎమ్మెల్యే కారు ఎత్తుకెళ్లిన దొంగలు

రాజస్ధాన్‌లోని  లోక్ తాంత్రిక్ పార్టీ ఎమ్మెల్యే నారాయన్ బెనివాల్‌కు   చెందిన ఎస్ యూవీ కారును గుర్తు తెలియని వ్యక్తులు దొంగిలించుకు పోయారు. 

Rajasthan : ఎమ్మెల్యే కారు ఎత్తుకెళ్లిన దొంగలు

Narayan Beniwal

Rajasthan : అసెంబ్లీ నియోజకవర్గానికి ఎమ్మెల్యే అంటే అతనికి ఉన్న అనుచర గణం, సెక్యూరిటీ, ఆయన వద్దకు  వచ్చి పోయే ప్రజలు ఇదాంతా చూస్తే చాలా హాడావిడిగా ఉంటుంది.  దానికి తోడు ఇంటివద్ద  సీసీటీవీ నిఘా కూడా ఉంటుంది.  అట్లాంటివి ఏమీ మాకు అడ్డు కాదనుకున్న ఆ చోర శిఖామణులు ఎమ్మెల్యే ఇంటికే కన్నం వేశారు. ఆయన కారును చోరీ చేసి తీసుకు వెళ్లారు.

రాజస్ధాన్‌లోని  లోక్ తాంత్రిక్ పార్టీ ఎమ్మెల్యే నారాయన్ బెనివాల్‌కు   చెందిన ఎస్ యూవీ కారును గుర్తు తెలియని వ్యక్తులు దొంగిలించుకు పోయారు.   జైపూర్ లోని  వివేక్ విహార్ ప్రాంతంలో ఆయన అపార్ట్ మెంట్ ముందు నిలిపి ఉంచిన  కారును శనివారం రాత్రి దొంగలు ఎత్తుకెళ్లినట్లు పోలీసులు తెలిపారు. ఎమ్మెల్యే బెనివాల్ ఫోన్ ద్వారా జైపూర్ పోలీసు కమీషనర్ ఆనంద్ శ్రీవాస్తవకు ఫిర్యాదు చేశారు.

సమాచారం అందుకున్న శ్యామ్ నగర్ పోలీసులు ఇంటివద్ద ఉన్నసీసీటీవీ ఫుటేజిని పరిశీలిస్తున్నారు. దొంగలకు  అసలు పోలీసులంటే లెక్క లేకుండా పోయిందని, రోజూలాగా మా అపార్ట్మెంట్  ముందు నిలిపిన   కారు తెల్లారి వచ్చి చూసే సరికి లేదని… ఒక ఎమ్మెల్యే  వాహానాన్నే ఈవిధంగా చోరీ చేస్తే… సాధారణ పౌరుల పరిస్ధితి ఏమిటని ఎమ్మెల్యే బెనివాల్ అన్నారు.

సాధారణ ప్రజలను నాకాబంది పేరుతో పోలీసులు తనిఖీలు చేస్తారు… కానీ దొంగలు దర్జాగా తిరుగుతుంటారని ఆయన ఆరోపించారు. నారాయణ బేనివాల్  రాజస్ధాన్లోని నాగౌర్ జిల్లా లోని ఖిన్వాసర్ నియోజక వర్గంనుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. నారాయణ బేనివాల్ నాగౌర్ ఎంపీ హానుమన్ బేనివాల్ సోదరుడు.

Also Read : Cloudburst : సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించిన క్లౌడ్ బరస్ట్ అంటే …..