RajKundra Case : ఆ నలుగురు : రాజ్‌కుంద్రా చుట్టూ బిగుస్తున్న ఉచ్చు

పోర్న్ చిత్రాల నిర్మాణం కేసులో అరెస్టైన ప్రముఖ వ్యాపారవేత్త, హీరోయిన్ శిల్పాశెట్టి భర్త రాజ్‌కుంద్రా చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. పోర్న్ చిత్రాల నిర్మాణంపై ఆయన కంపెనీలో పని చేస్తున్న నలుగురు ఉద్యోగులు సాక్ష్యమిచ్చేందుకు ముందుకు వచ్చినట్లు సమాచారం. 

RajKundra Case : ఆ నలుగురు : రాజ్‌కుంద్రా చుట్టూ బిగుస్తున్న ఉచ్చు

Raj Kundra

RajKundra Case : పోర్న్ చిత్రాల నిర్మాణం కేసులో అరెస్టైన  ప్రముఖ వ్యాపారవేత్త, హీరోయిన్ శిల్పాశెట్టి భర్త రాజ్‌కుంద్రా చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. పోర్న్ చిత్రాల నిర్మాణంపై   ఆయన కంపెనీలో పని చేస్తున్న నలుగురు ఉద్యోగులు సాక్ష్యమిచ్చేందుకు ముందుకు వచ్చినట్లు సమాచారం.

ఆ నలుగురు ఈ మేరకు సీబీఐ అధికారులను సంప్రదించినట్లు తెలుస్తోంది. ఈ కేసులో వ్యాపార ఒప్పందాలు, ఆర్ధిక లావాదేవీలకు సంబంధించిన కీలక సమాచారం ఇంకా బయటపడాల్సి ఉంది.  పోలీసు కస్టడీలో ఉన్నరాజ్ కుంద్రా ఇందుకు సహకరించటం లేదని తెలుస్తోంది.

ఈ కేసులో సాక్ష్యం చెప్పటానికి అతని వద్ద పనిచేస్తున్న ఉద్యోగులే  ముందుకు రావటంతో  ఆనలుగురి సాక్ష్యం కీలకం కానున్నదని పోలీసులు తెలిపారు. మెజిస్ట్రేట్ సమక్షంలో త్వరలో వీరి వాంగ్మూలాన్ని రికార్డు చేయనున్నారు.

మరో వైపు ముంబైలోని రాజ్ కుంద్రాకు చెందిన వియాన్ ఇండ్రస్ట్రీస్ కార్యాలయంలో శనివారం పోలీసులు సోదాలు  నిర్వహించారు. వీరికి ఓ లాకర్ దొరకినట్లు తెలుస్తోంది. అందులో పలు వ్యాపార లావాదేవీల ఒప్పంద పత్రాలు, క్రిప్టో కరెన్సీకి సంబంధించిన పత్రాలు లభ్యమైనట్లు సమాచారం. క్రైం బ్రాంచ్ వీటిని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.

ఈలాకర్ ను రహస్యంగా ఉంచారని అందుకే గతంలో నిర్వహించిన సోదాల్లో ఈ లాకర్ బయటపడ లేదని తెలుస్తోంది. జులై 27 వరకు రాజ్ కుంద్రా జ్యూడిషియల్ కస్టడీ కొనసాగనుంది. కాగా తన అరెస్ట్ పై రాజ్ కుంద్రా ముంబై హైకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు.

ఈకేసులో మనీలాండరింగ్ చట్టం, మరియు విదేశీ మారక ఉల్లంఘన కేసుకూడా నమోదవటంతో .. ఈడీ అధికారులు కూడా దర్యాప్తులో భాగస్వాములయ్యారు. జులై 26 తర్వాత ఈడీ అధికారులు ఎప్పుడైనా రాజ్ కుంద్రాను విచారించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.