Ramanthapur Narayana College Incident : రామంతాపూర్ నారాయణ కాలేజీ ఘటనలో ఇద్దరి పరిస్థితి విషమం

రామంతాపూర్ నారాయణ కాలేజీ బాధితులను డీఆర్డీవో అపోలో ఆసుపత్రికి తరలించారు. మంటల్లో గాయపడిన ముగ్గురిని వారి కుటుంబసభ్యులు గాంధీ ఆసుపత్రి నుంచి మెరుగైన వైద్యం కోసం అపోలో ఆసుపత్రికి షిఫ్ట్ చేశారు. పెట్రోల్ కావడంతో గాయాల తీవ్రత ఎక్కువగా ఉందని డాక్టర్లు చెబుతున్నారు.

Ramanthapur Narayana College Incident : రామంతాపూర్ నారాయణ కాలేజీ ఘటనలో ఇద్దరి పరిస్థితి విషమం

Ramanthapur Narayana College Incident : హైదరాబాద్ రామంతాపూర్ నారాయణ కాలేజీ బాధితులను మిథానీలోని డీఆర్ డీవో అపోలో ఆసుపత్రికి తరలించారు. మంటల్లో కాలిన ముగ్గురిని వారి కుటుంబసభ్యులు గాంధీ ఆసుపత్రి నుంచి మెరుగైన వైద్యం కోసం అపోలో ఆసుపత్రికి షిఫ్ట్ చేశారు. పెట్రోల్ కావడంతో గాయాల తీవ్రత ఎక్కువగా ఉందని డాక్టర్లు చెబుతున్నారు. మంటల్లో స్టూడెంట్ లీడర్ సందీప్, నారాయణ కాలేజీ ఏవో అశోక్ రెడ్డికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఇద్దరికీ 67 శాతానికిపైగా గాయాలు అయ్యాయి. దీంతో వీరి పరిస్థితి విషమంగా మారింది. 24 గంటలు గడిస్తేనే కానీ ఏమీ చెప్పలేము అంటున్నారు డాక్టర్లు. ఇదే ప్రమాదంలో నారాయణ కాలేజీ ప్రిన్సిపల్ సుధాకర్ రెడ్డికి 30శాతానికి పైగా గాయాలయ్యాయి.

Hyderabad : నారాయణ కాలేజీలో ఒంటికి నిప్పంటించుకుని ప్రిన్సిపాల్‪‌ను పట్టుకున్న విద్యార్థి ఘటనలో బిగ్ ట్విస్ట్..!!

హైదరాబాద్ రామంతాపూర్ లోని నారాయణ కాలేజీలో జరిగిందీ దుర్ఘటన. ఫీజు విషయంలో స్టూడెంట్ లీడర్ సందీప్, నారాయణ కాలేజీ యాజమాన్యం మధ్య వివాదం చెలరేగింది. ఫీజు చెల్లించకుంటే టీసీ ఇచ్చేది లేదని కాలేజీ యాజమాన్యం తెగేసి చెప్పింది. టీసీ ఎలా ఇవ్వరో చూస్తామని విద్యార్థుల తరుఫున వచ్చిన స్టూడెంట్ లీడర్ వార్నింగ్ ఇచ్చారు. అంతేకాదు పెట్రోల్ పోసుకుని బెదిరించే ప్రయత్నం చేశారు. అయితే అనుకోకుండా జరిగిన ప్రమాదంలో స్టూడెంట్ లీడర్, కాలేజీ సిబ్బంది మొత్తం ముగ్గురు మంటల్లో తీవ్రంగా గాయపడ్డారు.

రామంతాపూర్ కి చెందిన సాయినాథ్ స్థానిక నారాయణ కాలేజీలో ఈ ఏడాది ఇంటర్ పూర్తి చేశాడు. అతడు కాలేజీకి 16వేల రూపాయల ఫీజు కట్టాల్సి ఉంది. దీంతో కాలేజీ యాజమాన్యం అతడికి టీసీ ఇవ్వలేదు. తనకు టీసీ ఇవ్వాలని సాయినాథ్ తన తల్లిదండ్రులతో కలిసి యాజమాన్యాన్ని పలుమార్లు విజ్ఞప్తి చేశాడు. రూ.16వేలు కడితే తప్ప టీసీ ఇచ్చేది లేదని ప్రిన్సిపల్ సుధాకర్ రెడ్డి, ఏవో అశోక్ రెడ్డి తేల్చి చెప్పారు. దీంతో సాయినాథ్ స్టూడెంట్ లీడర్ సందీప్ ని కలిశాడు. తనకు టీసీ ఇప్పించాలని కోరాడు.

Hyderabad: ఒంటికి నిప్పంటించుకుని ప్రిన్సిపాల్‪‌ను పట్టుకున్న విద్యార్థి.. ఇద్దరికీ గాయాలు

విద్యార్థి సంఘం నేతగా సందీప్, కొంతమంది యూనియన్ సభ్యులు సాయినాథ్ తో కలిసి కాలేజీకి వెళ్లాడు. రూమ్ లో ప్రిన్సిపల్, ఏవోతో కాసేపు చర్చలు జరిపారు. ఇరువర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. యాజమాన్యం ఎంతకూ దిగిరాకపోవడంతో వారిని బెదిరించాలని సందీప్ అనుకున్నాడు. తనపై పెట్రోల్ పోసుకున్నాడు. అయితే పక్కనే దేవుడి ఫొటోల ముందు దీపం వెలిగించి ఉంది. సందీప్ తనపై పెట్రోల్ పోసుకోగానే ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయి. అతడి పక్కనే కుర్చీలో కూర్చుని ఉన్న ఏవో అశోర్ రెడ్డికి సైతం మంటలు వ్యాపించాయి.

మంటలు అంటుకున్న సందీప్ ప్రిన్సిపల్ ను పట్టుకునే ప్రయత్నం చేశాడు. అయితే సందీప్ ను ప్రిన్సిపల్ పక్కకి నెట్టేయడంతో.. స్వల్ప గాయాలతో ప్రిన్సిపాల్ బయటపడ్డారు. ఘటన జరిగిన వెంటనే సాయినాథ్ తో పాటు మిగతావారు అక్కడి నుంచి పారిపోయారు. అప్రమత్తమైన కాలేజీ సిబ్బంది ఫైర్, పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే అక్కడికి చేరుకున్న అధికారులు మంటల్లో తీవ్రంగా గాయపడిన సందీప్, ఏవో అశోక్, ప్రిన్సిపాల్ సుధాకర్ రెడ్డిలను గాంధీ ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం ప్రైవేట్ ఆసుపత్రులకు తరలించారు.