మూడు రోజులు అక్కడ..మూడు రోజలు ఇక్కడ..ఒక రోజు వీక్ ఆఫ్

మూడు రోజులు అక్కడ..మూడు రోజలు ఇక్కడ..ఒక రోజు వీక్ ఆఫ్

Ranchi : 3 days wife, 3 days with girlfriend and this person will be on vacation, find out the unique story of division : బాలీవుడ్ హీరో అనిల్ కపూర్ సినిమా గుర్తుందా ఘర్వాలీ..బాహర్ వాలీ …అచ్చు అలాగే జరిగింది రాంచీలోని ఓ కుటుంబంలో.

జార్ఖండ్, రాంచీలోని కోక్రతిరోల్   రోడ్ కు చెందిన రాజేష్ మహాతోకు పెళ్లైంది. వారిద్దరికీ ఒక బిడ్డ జన్మించింది. అతను ఆ విషయం దాచి పెట్టి మరోక యువతితో ప్రేమాయణం సాగించాడు. తనకింకా పెళ్లి కాలేదని… ఆమెను  ప్రేమించి పెళ్లి చేసుకోటానికి,  ఆమెను తీసుకుని పారిపోయాడు.

తన భర్త కనిపించకపోయే సరికి  రాజేష్ భార్య సదర్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసింది.  మరోక వైపు తమ కుమార్తెను రాజేష్ కిడ్నాప్ చేసి తీసుకువెళ్లాడని ఆమె తల్లి తండ్రులు పోలీసు స్టేషన్ లో  ఫిర్యాదు చేశారు.  కేసు నమోదు చేసుకున్న పోలీసులు రాజేష్ మహాతో గురించి వెతకటం మొదలెట్టారు.

మొత్తానికి క్రితం నెలలో రాజేష్ ను పోలీసులు ప్రియురాలితో  సహా పట్టుకున్నారు. దీంతో అతని ప్రియురాలికి…. తన ప్రియుడికి అప్పటికే పెళ్లై, పిల్ల ఉందన్న సంగతి తెలిసింది.  వాళ్లవద్ద  నుంచి పారిపోయి వచ్చి రాజేష్ తనను వివాహం చేసుకున్నట్లు  తెలుసుకుంది.

ఇద్దరూ భార్యలు పోలీసు స్టేషన్ కు చేరుకున్నారు.  నా మొగుడు నాకే సొంతం అంటూ ఇద్దరూ కొట్టుకున్నారు. ఇద్దరు భార్యల మధ్య సఖ్యత కుదిర్చే క్రమంలో పోలీసులు ఒక రాజీఫార్ములా ప్రతిపాదించారు.

వారంలో 3 రోజులు భార్య దగ్గర,  3 రోజులు ప్రియురాలి దగ్గర ఉండేట్టు, ఒకరోజు అతని ఇష్టానికి వదిలేసి ముగ్గురి మధ్య రాజీ కుదిర్చి కాగితాల మీద సంతకాలు  తీసుకుని ఇళ్లకు పంపించారు. హమ్మయ్య సమస్య తీరిపోయిది అనుకుని ఎవరింటికి వారు వెళ్లిపోయారు.

రాజేష్ మొదటి భార్య వద్దకు వెళ్లినప్పుడు రెండో భార్య పోలీసు స్టేషన్ లో అతనిపై   ఫిర్యాదు చేసింది.   తనను మోసం చేసి పెళ్లి చేసుకున్నాడని…. మొదటి పెళ్లి దాచిపెట్టి తనపై   లైంగికదాడి చేసి పెళ్లి చేసుకున్నాడని ఆరోపిస్తూ పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేసింది.

కేసు నమోదు చేసుకున్న పోలీసులు రాజేష్ కోసం మొదటి భార్య ఇంటికి వెళ్లారు.  రెండో భార్య కేసు పెట్టిందని తెలుసుకున్న రాజేష్ అక్కడ్నించి తప్పించుకు  పారిపోయాడు.

ఇప్పుడు కేసు కోర్టుకు చేరింది. రాజేష్ పై అరెస్ట్ వారంట్ జారీ అయ్యింది. రాజేష్ పారిపోటానికి అతని మొదటి భార్య సహకరించిందని రెండో భార్య ఆరోపిస్తోంది. పరారీలో ఉన్న రాజేష్ ను పట్టుకోటానికి పోలీసులు  గాలింపు చేపట్టారు.