భిక్షాటన చేసే వృద్ధురాలిపై అత్యాచారయత్నం

మల్కాజిగిరిలో దారుణం జరిగింది. భిక్షాటన చేసే వృద్దురాలిపై మద్యం మత్తులో అత్యాచారానికి యత్నించారు దుర్మార్గులు.

  • Published By: veegamteam ,Published On : December 22, 2019 / 03:25 AM IST
భిక్షాటన చేసే వృద్ధురాలిపై అత్యాచారయత్నం

మల్కాజిగిరిలో దారుణం జరిగింది. భిక్షాటన చేసే వృద్దురాలిపై మద్యం మత్తులో అత్యాచారానికి యత్నించారు దుర్మార్గులు.

దేశంలో నిర్భయ చట్టం వచ్చినా మహిళలపై అఘాయిత్యాలు, లైంగిక దాడులు జరుగుతూనే ఉన్నాయి. కామాంధుల బుద్ధి మారడం లేదు. తెలంగాణలో దిశ హత్యాచార ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. దిశ నిందితులను ఎన్ కౌంటర్ కూడా చేశారు. ఇంకా దిశ హత్యాచారం, నిందితుల ఎన్ కౌంటర్ ఘటనలు మరువక ముందే మరో ఘోరం జరిగింది. 

మల్కాజిగిరిలో దారుణం జరిగింది. భిక్షాటన చేసే వృద్దురాలిపై మద్యం మత్తులో అత్యాచారానికి యత్నించారు దుర్మార్గులు. మాయ మాటలు చెప్పి మద్యం తాగించి అఘాయిత్యానికి పాల్పడేందుకు ప్రయత్నించారు. ఆమె గట్టిగా కేకలు వేయడంతో.. స్థానికులు పోలీసులకు ఫోన్ చేశారు. వెంటనే అక్కడకు చేరుకున్న పోలీసులు… ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. 

మిర్జాలగూడలో నివాసం ఉండే చిన్నప్ప ఆంథోనిజార్జి (50), విజయ్‌కుమార్ (53) పెయింటర్‌గా పనిచేస్తున్నారు. డిసెబర్ 17వ తేదీ రాత్రి 8 గంటల సమయంలో భిక్షాటన చేస్తున్న ఓ మహిళ(60)ను మద్యం తాగేందుకు రమ్మని పిలిచి ఆంథోని ఇంటికి తీసుకెళ్లారు. మోతాదుకు మించి మద్యం తాగిపించడంతో మహిళ అపస్మారకస్థితిలోకి వెళ్లింది. ఆ సమయంలో ఆమెపై లైంగికదాడికి పాల్పడి తీవ్రంగా కొట్టారు. 

రక్షించాలంటూ మహిళ కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు వచ్చి ఆమెను రక్షించి డయల్ 100కు ఫోన్ చేసి సమాచారం అందించారు. దాంతో మల్కాజ్‌గిరి పోలీస్‌స్టేషన్ పెట్రోలింగ్ ఇంచార్జి కే.నర్సింహలు, డ్రైవర్, కానిస్టేబుల్ రాము సంఘటనాస్థలానికి చేరుకొని బాధితురాలిని గాంధీ ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేశారు. నిందితులు ఆంథోని జార్జి, విజయ్‌కుమార్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.