Rape Attempt : ఇంటికి తీసుకెళ్లి సాఫ్ట్‌వేర్ ఉద్యోగినిపై స్నేహితుడు అత్యాచారయత్నం, ఫొటోలతో బ్లాక్ మెయిల్

ఈ రోజుల్లో ఎవరు మంచి వాళ్లో, ఎవరు చెడ్డ వాళ్లో తెలుసుకోవడం కష్టంగా మారింది. కామాంధులు రెచ్చిపోతున్నారు. ఎప్పుడు ఎటువైపు నుంచి దాడి చేస్తారో తెలియడం లేదు. కామంతో కళ్లు మూసుకుపోయి అకృత్యాలకు ఒడిగడుతున్నారు. స్నేహితులు సైతం దారుణాలకు తెగబడుతున్నారు.

Rape Attempt : ఇంటికి తీసుకెళ్లి సాఫ్ట్‌వేర్ ఉద్యోగినిపై స్నేహితుడు అత్యాచారయత్నం, ఫొటోలతో బ్లాక్ మెయిల్

Rape Attempt On Software Engineer

Rape Attempt On Software Engineer : ఈ రోజుల్లో ఎవరు మంచి వాళ్లో, ఎవరు చెడ్డ వాళ్లో తెలుసుకోవడం కష్టంగా మారింది. కామాంధులు రెచ్చిపోతున్నారు. ఎప్పుడు ఎటువైపు నుంచి దాడి చేస్తారో తెలియడం లేదు. కామంతో కళ్లు మూసుకుపోయి అకృత్యాలకు ఒడిగడుతున్నారు. స్నేహితులు సైతం దారుణాలకు తెగబడుతున్నారు. ఇన్నాళ్లు ఫ్రెండ్ గా ఉన్నవాళ్లు కూడా సైకోల్లా మారిపోతున్నారు. స్నేహితులుగా ఉన్న సమయంలో దిగిన ఫొటోలు, వీడియోలతో బ్లాక్ మెయిల్ కు పాల్పడుతున్నారు. కోరికలు తీర్చాలని, పెళ్లి చేసుకోవాలని వేధిస్తున్నారు. లేదంటే పరువు తీస్తామని బెదిరిస్తున్నారు. సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా పని చేసే ఓ అమ్మాయి విషయంలో ఇదే జరిగింది. ఫ్రెండ్ అని అతడిని నమ్మినందుకు నిండా ముంచాడు. అతడి ఇంటికి వెళితే ఊహించని ఘోరం జరిగింది. ఆ నీచుడు ఆమెపై అత్యాచారయత్నం చేయబోయాడు. ఆ తర్వాత స్నేహితులుగా ఉన్న సమయంలో దిగిన ఫోటోలతో బ్లాక్ మెయిల్ కు దిగాడు.

అత్యాచారయత్నం, ఫొటోలతో బ్లాక్ మెయిల్:
తనపై కొల్లా మణికంఠ అనే యువకుడు అత్యాచార యత్నానికి పాల్పడటంతో పాటు తనతో దిగిన ఫొటోలతో బెదిరిస్తున్నట్లుగా ఓ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిని భవానీపురం పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధిత యువతి కుటుంబసభ్యులతో కలసి భవానీపురంలో నివాసం ఉంటోంది. హైదరాబాద్‌లోని ఒక సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో పని చేస్తుంది. కరోనా నేపథ్యంలో వర్క్‌ఫ్రం హోం ఇవ్వడంతో భవానీపురంలోని ఇంటి నుంచే ఉద్యోగం చేస్తోంది. ఆమె ఇంజినీరింగ్‌ చదువుతున్న సమయంలో అదే కాలేజీలో ఎంబీఏ చదువుతున్న మణికంఠతో పరిచయం ఏర్పడింది.

ఇంటికి తీసుకెళ్లి పాడుపని:
ఇద్దరూ మంచి స్నేహితులయ్యారు. సరదాగా మాట్లాడుకునే వాళ్లు. అంతేకాదు కలిసి ఫొటోలూ దిగారు. ఈ క్రమంలో ఆమె ఇంజినీరింగ్‌ ఫైనల్ ఇయర్ చదువుతున్న సమయంలో మణికంఠ ఆమెను హెచ్‌బీకాలనీలోని తన ఇంటికి తీసుకెళ్లాడు. ఫ్రెండ్ కావడంతో యువతి అతడిని నమ్మి ఇంటికెళ్లింది. అక్కడ ఆమెపై అత్యాచారం చేసేందుకు మణికంట ప్రయత్నించాడు. అనూహ్య పరిణామంతో షాక్ తిన్న యువతి భయపడిపోయింది. ఎలాగో తప్పించుకుని అక్కడి నుంచి బయటపడింది.

తననే పెళ్లి చేసుకోవాలని వార్నింగ్:
ఆ తర్వాత ఆమెకు పెళ్లి చేసేందుకు తల్లిదండ్రులు ప్రయత్నాలు ప్రారంభించారు. ఆమె ఫొటోలను మ్యాట్రిమోనీ సైట్‌లో పెట్టారు. వాటిని చూసిన మణికంఠ మరింత రెచ్చిపోయాడు. మార్చి 25న నేరుగా ఆమె ఇంటికి వెళ్లాడు. తననే పెళ్లి చేసుకోవాలన్నాడు. లేకపోతే చంపేస్తానని బెదిరించాడు. ఆ తర్వాత ఏప్రిల్ 1న మరోసారి ఇంటికెళ్లి ఆమెతో అసభ్యకరంగా మాట్లాడాడు. అంతేకాదు… ఇద్దరూ కలిసి ఉన్న ఫొటోలు, వీడియోలు తన దగ్గర ఉన్నాయని, వాటిని సోషల్ మీడియాలో పెడతానని బెదిరించాడు. దీంతో బాధిత యువతి భయాందోళనకు గురైంది. మరో దారి లేకపోవడంతో భవానీపురం పోలీసులను ఆశ్రయించింది. మణికంఠపై ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.