రూ.5 కోట్లు ఇస్తే మోడీని చంపుతానని ప్రకటించిన వ్యక్తి అరెస్ట్

రూ.5 కోట్లు ఇస్తే మోడీని చంపుతానని ప్రకటించిన వ్యక్తి అరెస్ట్

Realtor arrested in Puducherry for social media message offering to kill Prime Minister for Rs. 5 Crore : తనకు ఎవరైనా రూ. 5 కోట్లు ఇస్తే ప్రధాని మోడీని చంపేస్తానని  ఫేస్ బుక్ లో వ్యాఖ్యలు  చేసిన వ్యక్తిని  పోలీసులు అరెస్ట్ చేశారు.  పుదుచ్చేరికి చెందిన సత్యానందం(43)  అనే రియల్టర్ తన ఫేస్ బుక్ లో ఈ వ్యాఖ్యలు చేశాడు.

అది చూసిన ఒక ట్యాక్సిడ్రైవర్ పోలీసులకు సమాచారం ఇచ్చాడు.  ఫేస్ బుక్ ఎకౌంట్ ఆధారంగా   సత్యానందాన్ని ట్రేస్ చేసిన పోలీసులు   పుదుచ్చేరికి సమీపంలోని  ఆర్యన్ కుప్పం గ్రామంలో గురువారం  అరెస్ట్  చేసి కోర్టులో  హాజరు పరిచారు.  న్యాయమూర్తి  అతడ్ని రిమాండ్ కు తరలించారు.  నిందితుడిపై  ఐపీసీ సెక్షన్ 505(1), 505(2) కింద కేసులు నమోదు చేశారు.