గోల్నాక ఫంక్షన్ హాల్ ప్రమాదం : గోడ కూలడానికి కారణమిదే

హైదరాబాద్ అంబర్ పేట పరిధిలోని గోల్నాకలో పెరల్ గార్డెన్ ఫంక్షన్ హాల్ లో ఘోర ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. ఫంక్షన్ హాల్ గోడ కూలిన ఘటనలో నలుగురు చనిపోయారు.

  • Published By: veegamteam ,Published On : November 10, 2019 / 11:43 AM IST
గోల్నాక ఫంక్షన్ హాల్ ప్రమాదం : గోడ కూలడానికి కారణమిదే

హైదరాబాద్ అంబర్ పేట పరిధిలోని గోల్నాకలో పెరల్ గార్డెన్ ఫంక్షన్ హాల్ లో ఘోర ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. ఫంక్షన్ హాల్ గోడ కూలిన ఘటనలో నలుగురు చనిపోయారు.

హైదరాబాద్ అంబర్ పేట పరిధిలోని గోల్నాకలో పెరల్ గార్డెన్ ఫంక్షన్ హాల్ లో ఘోర ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. ఫంక్షన్ హాల్ గోడ కూలిన ఘటనలో నలుగురు చనిపోయారు. ఐదుగురికి గాయాలు అయ్యాయి. వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. తీవ్రంగా గాయపడిన వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు చెప్పారు. పెళ్లి వేడుక జరుగుతన్న సమయంలోనే ఈ ప్రమాదం జరిగింది.

ఈ ప్రమాదంపై ఈస్ట్ జోన్ డీసీపీ రమేష్ స్పందించారు. ఫంక్షన్ హాల్ పురాతమైన భవనం అన్నారు. 15 ఏళ్ల క్రితం ఫంక్షన్ హాల్ నిర్మించారని తెలిపారు. నిర్వాహాకుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోందన్నారు. వారి నిర్లక్ష్యం కారణంగానే ఈ ప్రమాదం జరిగిందన్నారు. ఫంక్షన్ హాల్ నిర్వాహాకులపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని డీసీపీ తెలిపారు.

ప్రమాదం సమాచారం తెలుసుకున్న వెంటనే అంబర్ పేట పోలీసులు, జీహెచ్ఎంసీ సిబ్బంది, డిజాస్టర్ టీమ్ ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. శిథిలాల తొలగింపు పనులను ముమ్మరం చేశారు. గోడ కూలిన ఘలనలో 2 ఆటోలు, 10 బైక్ లు ధ్వంసం అయ్యాయి. మృతులను విజయలక్ష్మి, సురేష్, కృష్ణయ్య, సొహేల్ గా గుర్తించారు.

గోల్నాక పెరల్ గార్డెన్ ప్రమాదంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని, ఘటనపై పూర్తి విచారణ జరిపించాలని అధికారులను ఆదేశించారు. మృతుల కుటుంబాలకు ఆయన సానుభూతి తెలిపారు.