Rental Cars Gang : అద్దెకార్లు తాకట్టు పెట్టే ముఠా అరెస్ట్

కార్లకు అధిక మొత్తంలో అద్దె చెల్లిస్తామంటూ కార్లను అద్దెకు తీసుకుని, వాటిని తాకట్టు పెట్టి, ఆ వచ్చిన డబ్బులతో జల్సాలు చేస్తున్న ముఠాను గుంటూరు అర్బన్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 21 కార్లను స్వాధీనం చేసుకున్నారు.

Rental Cars Gang : అద్దెకార్లు తాకట్టు పెట్టే ముఠా అరెస్ట్

Rental car pawn gang arrested

Rental Cars Gang : కార్లకు అధిక మొత్తంలో అద్దె చెల్లిస్తామంటూ కార్లను అద్దెకు తీసుకుని, వాటిని తాకట్టు పెట్టి, ఆ వచ్చిన డబ్బులతో జల్సాలు చేస్తున్న ముఠాను గుంటూరు అర్బన్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 21 కార్లను స్వాధీనం చేసుకున్నారు.

గుంటూరు‌కు చెందిన వెంకట నరసింహారావు, కొమిరి శెట్టి సాంబశివరావు, రిషిలు కార్లను కొనుగోలు చేసి అమ్ముతుంటారు. 2019లో ఏర్పడిన లాక్‌డౌన్ సమయంలో వీరి వ్యాపారాలు సరిగా నడవక అర్ధికంగా చాలా నష్టపోయారు. చెడు వ్యవనాలకు బానిసైన ముగ్గురూ ఈజీమని సంపాదించేందుకు అడ్డదారులు వెతుక్కున్నారు.

తమకు ఉన్న పరిచయాలతో కార్ల మోడల్‌ను బట్టి కారు యజమానులకు 45 వేల నుండి లక్ష రూపాయల వరకు అధిక ధరకు అద్దె చెల్లిస్తామంటూ కార్ల యజమానులకు గాలం వేశారు. అలా తీసుకున్న కార్లకు రెండు మూడు నెలలు సక్రమంగా అద్దె చెల్లించేవారు. ఆతరువాత వాటిని తమకు పరిచయం వున్న సయ్యద్ బాజి, శ్రీనుల ద్వారా వారికి కమీషన్ ఇచ్చి వాటిని తాకట్టు పెట్టేవారు. ఆడబ్బులతో జల్సాలు చేసేవారు.

కార్ల యజమానులకు కనబడకుండా తప్పించుకొని తిరుగుతూ ఇప్పటి వరకు 25 కార్లను తాకట్టు పెట్టి రూ.1.18 కోట్ల రూపాయల డబ్బులు తీసుకుని జల్సాలు చేశారు. తాకట్టు పెట్టుకున్న వారికి రెండు మూడు నెలలు వడ్డీ చెల్లించి పత్తా లేకుండా పోయేవారు. ఈక్రమంలో గుంటూరుకు చెందిన కారు యజమాని జయదీప్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న నల్లపాడు పోలీసులు దర్యాప్తు చేశారు.

నిందితులు గుంటూరు, ప్రకాశం జిల్లాలతో పాటు మార్కాపురం, నెల్లూరు జిల్లా కావలి, కృష్ణా జిల్లా పెనమలూరు, కీసర ప్రాంతాలలో ఇదే తరహాలో కార్లను తనఖా పెట్టినట్లు తేలింది. పోలీసులు నరసింహారావు, సాంబశివరావు లను అరెస్టు చేశారు. వారి వద్దనుండి 21 కార్లను జప్తు చేశారు. మరికొన్ని కార్లను రిషీ వద్ద రికవరీ చేయాల్సి వుందని ….పరారిలో వున్నాడని త్వరలో నిందితుడుని పట్టుకుంటామని అర్బన్ యస్పి ఆరిఫ్ హఫీజ్ తెలిపారు.