Vikarabad : రిటైర్డ్ పోలీస్ అధికారి వక్రబుద్ధి.. భూ సమస్య పరిష్కరిస్తానని మహిళలకు వేధింపులు

వికారాబాద్ లో ఓ రిటైర్డ్ పోలీస్ అధికారి వక్రబుద్ధి బయటపడింది. భూ వివాదంలో న్యాయం చేస్తానని మహిళలను వేధింపులకు గురి చేశాడు.

Vikarabad : రిటైర్డ్ పోలీస్ అధికారి వక్రబుద్ధి.. భూ సమస్య పరిష్కరిస్తానని మహిళలకు వేధింపులు

Vikarabad (2)

Vikarabad : వికారాబాద్ లో ఓ రిటైర్డ్ పోలీస్ అధికారి వక్రబుద్ధి బయటపడింది. భూ వివాదంలో న్యాయం చేస్తానని మహిళలను వేధింపులకు గురి చేశాడు. వికారాబాద్ కు చెందిన ముగ్గురు అక్కాచెళ్లెల్లకు భూ సమస్య పరిష్కరిస్తానని చెప్పిన అతను వారికి ఫోన్ చేసి వేధించడం మొదలు పెట్టాడు.

ఓ రోజు రాత్రి సమయంలో మాజీ అధికారి తమ ఇంటికి వచ్చాడని, తుపాకీ చూపించి భయభ్రాంతులకు గురి చేశాడని భాదితురాలు వాపోయారు. రానూరానూ అతని వేధింపులు ఎక్కువవ్వడంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించారు.

Charlapalli Jail : ఖైదీల భార్యలపై చర్లపల్లి జైలు అధికారి కన్ను.. న్యూడ్ వీడియో కాల్ చేయాలని వేధింపులు

అయితే పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని బాధితురాలు మీడియా ముందు తన గోడును వెళ్లబోసుకున్నారు. తమను వేధిస్తోన్న రిటైర్డ్ పోలీసును అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. తమకు న్యాయం చేయాలని కోరారు.