WhatsApp Message: వాట్సాప్ మెసేజ్‌ లింక్‌పై క్లిక్ చేసిన ఏపీ మహిళ.. రూ.21 లక్షలు మాయం

తన వాట్సాప్ మెసేజ్‌తో వచ్చిన లింక్‌పై క్లిక్ చేసిందో మహిళ. అంతే ఆమె బ్యాంక్ అకౌంట్‌లో ఉన్న రూ.21 లక్షలు కొట్టేశారు సైబర్ నేరగాళ్లు. ఆ లింక్ ద్వారా ఆమె ఫోన్ హ్యాక్ చేసి, డబ్బులు కొట్టేశారు. ఇలాంటి మెసేజెస్ విషయంలో అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.

WhatsApp Message: వాట్సాప్ మెసేజ్‌ లింక్‌పై క్లిక్ చేసిన ఏపీ మహిళ.. రూ.21 లక్షలు మాయం

WhatsApp Message: గుర్తు తెలియని నెంబర్లు, సోర్సెస్ నుంచి వచ్చే టెక్స్ట్ మెసేజెస్, వాట్సాప్‌ మెసేజెస్ విషయంలో అప్రమత్తంగా ఉండాలని ఎంత చెబుతున్నా కొందరు నిర్లక్ష్యంగానే ఉంటున్నారు. సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోతున్నారు. తాజాగా ఏపీకి చెందిన ఒక మహిళ అలా తనకు వాట్సాప్‌లో వచ్చిన ఒక మెసేజ్ లింక్‌పై క్లిక్ చేసి రూ.21 లక్షలు పోగొట్టుకుంది. తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేసింది.

Teen kills friend: స్కూలు తప్పించుకునేందుకు జైలుకు వెళ్లాలని.. స్నేహితుడిని చంపిన విద్యార్థి

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అన్నమయ్య జిల్లాకు చెందిన వరలక్ష్మి అనే మహిళ టీచర్‌గా పని చేసి రిటైరయ్యారు. సోమవారం ఆమెకు గుర్తు తెలియని నెంబర్ నుంచి వాట్సాప్‌లో ఒక మెసేజ్ వచ్చింది. ఆ మెసెజ్‌తో ఉన్న లింక్‌పై క్లిక్ చేసింది. తర్వాత వెంటనే ఆమె అకౌంట్ నుంచి వరుసగా డబ్బులు పోయాయి. అనేక సార్లు ఆమె అకౌంట్‌లోంచి రూ.20,000, రూ.40,000, రూ.80,000 చొప్పున విత్‌డ్రా అయినట్లు మెసేజ్‌లు వచ్చాయి. మొత్తం ఆమె అకౌంట్‌లో ఉన్న రూ.21 లక్షలు పోయాయి. దీంతో షాక్ అయిన ఆ మహిళ వెంటనే బ్యాంకు అధికారులను సంప్రదించింది. ఆమె ఫోన్ హ్యాక్ అయ్యిందని, సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేయాలని బ్యాంకు అధికారులు సూచించారు.

Sisters Suicide: అన్న తిట్టాడని విషం తాగి చెల్లెళ్ల ఆత్మహత్య

వెంటనే ఆమె సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. వాట్సాప్ లింక్‍‌పై అనేకసార్లు ఆమె క్లిక్ చేయడం వల్లే, తన అకౌంట్‌లోంచి డబ్బుల్ని సైబర్ నేరగాళ్లు కొట్టేశారని పోలీసులు తెలిపారు. దీనిపై విచారణ జరుపుతున్నామని, ఇలాంటి మెసేజెస్ విషయంలో అందరూ అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు.