పొగ మంచు : ఒకదానికొకటి ఢీకొన్న వాహనాలు 

మంచు కారణంగా దారి కనిపించకపోవడంతో వరసుగా మూడు కార్లు ఒకదానికొకటి ఢీకొన్నాయి.

  • Published By: veegamteam ,Published On : January 12, 2019 / 05:35 AM IST
పొగ మంచు : ఒకదానికొకటి ఢీకొన్న వాహనాలు 

మంచు కారణంగా దారి కనిపించకపోవడంతో వరసుగా మూడు కార్లు ఒకదానికొకటి ఢీకొన్నాయి.

రంగారెడ్డి : రహదారులు నెత్తురోడుతున్నాయి. ఔటర్ రింగ్ రోడ్డు, జాతీయ రహదారులపై రోడ్డు ప్రమాదాలు పరిపాటిగా మారిపోయాయి. తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. పొగమంచు కారణంగా దారి కనపడకపోవడంతో కూడా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. అనేకమంది ప్రాణాలు కోల్పుతున్నారు. ఔటర్ రింగ్ రోడ్డుపై జరిగిన రోడ్డు ప్రమాద ఘటన మరువకముందే జాతీయ రహదారిపై మరో ప్రమాదం చోటుచేసుకుంది. రంగారెడ్డి జిల్లాలో శనివారం రోడ్డు ప్రమాదం జరిగింది.

జిల్లాలోని నందిగామ మండల పరిధిలోని జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. సంక్రాంతి పండుగ సందర్భంగా హైదరాబాద్ నుంచి మహబూబ్‌నగర్ వైపు వెళ్తున్న వాహనాలను పొగ మంచు అడ్డుకుంది. మంచు కారణంగా దారి కనిపించకపోవడంతో వరసుగా మూడు కార్లు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరికి తీవ్ర గాయాలు అయ్యాయి. 

ఇవాళ ఉదయం షాద్ నగర్ సమీపంలోని కొత్తూరు వద్ద జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. దట్టమైన మంచు కారణంగా వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. 3 ఆర్టీసీ బస్సులు, 2 ప్రైవేటు ట్రావెల్స్ బస్సులు 2 లారీలు, ఆటో, కారు ఒకదానికొకటి ఢీకొని ధ్వంసమయ్యాయి. దీంతో రహదారిపై 6 కిలోమీటర్ట మేర వాహనాలు నిలిచిపోయాయి. తీవ్ర ట్రాఫిక్ జామ్ అయింది.