ఇప్పటివరకు రూ.14.67 కోట్లు పట్టివేత : లోక్‌సభ ఎన్నికలు

తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ఇప్పటివరకు రూ.14 కోట్ల 67 లక్షల 22 వేల 448ను స్వాధీనం చేసుకున్నామని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి కార్యాలయం తెలిపింది.

  • Published By: veegamteam ,Published On : March 22, 2019 / 03:39 AM IST
ఇప్పటివరకు రూ.14.67 కోట్లు పట్టివేత : లోక్‌సభ ఎన్నికలు

తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ఇప్పటివరకు రూ.14 కోట్ల 67 లక్షల 22 వేల 448ను స్వాధీనం చేసుకున్నామని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి కార్యాలయం తెలిపింది.

హైదరాబాద్‌: తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల కోడ్ అమలులో ఉన్నప్పటి నుంచి ఇప్పటివరకు రూ.14 కోట్ల 67 లక్షల 22 వేల 448 విలువైన మద్యం, మాదకద్రవ్యాలు, నగదు, ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నామని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి కార్యాలయం తెలిపింది. 
Read Also : ఎన్నిక‌ల టైంలో ఐటీ రైడ్స్ ఎలా చేస్తారు : ఈసీకి శివాజీ కంప్ల‌యింట్

పోలీస్‌, ఐటీ శాఖలు రూ.6 కోట్ల 30లక్షల 38 వేల 350 నగదును స్వాధీనం చేసుకున్నారు. రూ. కోటి 35 లక్షల 29 వేల 260 విలువైన మద్యం, రూ.2 కోట్ల 37లక్షల 86 వేల 640 విలువ చేసే కొకైన్‌, హెరాయిన్‌, గంజాయి మాదకద్రవ్యాలు పట్టుబడ్డాయి. వీటితోపాటు రూ.లక్షా 85 వేల 600 విలువైన బియ్యం, మూడు డబ్బు లెక్కపెట్టే యంత్రాలు, 208 చీరెలు, ద్విచక్రవాహనం, ఒక ఐ ఫోన్‌ ను స్వాధీనం చేసుకున్నారు. 
Read Also : డీకే అరుణ బాటలో మాజీ మంత్రి సునీతా లక్ష్మారెడ్డి?