Fake Currency : హైదరాబాద్ లో రూ.2 కోట్ల నకిలీ నోట్లు స్వాధీనం

హైదరాబాద్ గోల్కోండ పోలీసు స్టేషన్ పరిధిలో రూ. 2 కోట్ల నకిలీ కరెన్సీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నకిలీ నోట్లు మార్పిడి జరుగుతోందనే  విశ్వసనీయ సమాచారం మేరకు పోలీసులు  తనిఖీలు చ

Fake Currency : హైదరాబాద్ లో రూ.2 కోట్ల నకిలీ నోట్లు స్వాధీనం

Fake Currency Seized

Fake Currency : హైదరాబాద్ గోల్కోండ పోలీసు స్టేషన్ పరిధిలో రూ. 2 కోట్ల నకిలీ కరెన్సీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నకిలీ నోట్లు మార్పిడి జరుగుతోందనే  విశ్వసనీయ సమాచారం మేరకు పోలీసులు  తనిఖీలు చేపట్టారు.

ఈ క్రమంలో అనుమానాస్పదంగా సంచరిస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు పట్టుకున్నారు. వారి వద్ద ఉన్న సంచిలో రూ.2 కోట్ల నకిలీ నోట్లు లభ్యం అయ్యాయి.  వీటిలో  రూ.2వేలు. రూ. 500 నకిలీ నోట్లు ఉన్నాయి. పోలీసులు వారిద్దరినీ అదుపులోకి   తీసుకుని నకిలీ నోట్లు స్వాధీనం చేసుకున్నారు.

లంగర్ హౌస్ కు చెందిన లక్ష్మీ అనే మహిళను వీరు నకిలీ  నోట్లతో మోసం చేసే ప్రయత్నం చేశారని పోలీసులు తెలిపారు. ఆమెకు అప్పుగా నకిలీ కరెన్సీని ఇచ్చేందుకు సుదర్శన్ అనే వ్యక్తి ప్లాన్ చేశాడని… అందుకోసం నకిలీ నోట్లను అఫ్జల్ గంజ్ లో  కొనుగోలు చేశాడని చెప్పారు. ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్న పోలీసులు… ఈ కేసులో ఇంకెంతమంది ఉన్నారనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.