దొంగనోట్ల ముఠా గుట్టురట్టు : రియల్ ఎస్టేట్ వ్యాపారి నుంచి రూ.3 లక్షలు స్వాధీనం

విశాఖలో దొంగనోట్లను ముద్రించి చలామణి చేస్తున్న ముఠా గుట్టురట్టు చేశారు పోలీసులు. ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి దగ్గరి నుంచి సుమారు రూ.3 లక్షల రూపాయల దొంగ నోట్లను స్వాధీనం చేసుకున్నారు.

  • Published By: veegamteam ,Published On : December 1, 2019 / 07:59 AM IST
దొంగనోట్ల ముఠా గుట్టురట్టు : రియల్ ఎస్టేట్ వ్యాపారి నుంచి రూ.3 లక్షలు స్వాధీనం

విశాఖలో దొంగనోట్లను ముద్రించి చలామణి చేస్తున్న ముఠా గుట్టురట్టు చేశారు పోలీసులు. ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి దగ్గరి నుంచి సుమారు రూ.3 లక్షల రూపాయల దొంగ నోట్లను స్వాధీనం చేసుకున్నారు.

విశాఖలో దొంగనోట్ల ముఠా గుట్టురట్టు అయింది. దొంగనోట్లను ముద్రించి చలామణి చేస్తున్న ముఠా గుట్టురట్టు చేశారు పోలీసులు. ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి దగ్గరి నుంచి సుమారు రూ.3 లక్షల రూపాయల దొంగ నోట్లను స్వాధీనం చేసుకున్నారు. ఎంవీపీ పోలీస్ స్టేషన్ సమీపంలో నకిలీ రెండు వేలు, వంద రూపాయల నోట్లను చలామణి చేస్తుండగా నిందితుడు పట్టుబడ్డాడు. తూర్పుగోదావరికి చెందిన మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నారు. నకిలీ నోట్ల ముఠాను అరెస్టు చేస్తే పూర్తి ఆధారాలు లభిస్తాయని సిటీ పోలీస్ కమిషనర్ రాజీవ్ కుమార్ మీనా చెబుతున్నారు.

పశ్చిమగోదావరి జిల్లాలో మరో ముఠా భాగోతం బట్టబయలు అయింది. తనుకులో దొంగ నోట్ల ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. పైడిపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో దుకాణం దగ్గర కొందరు యువకులు కూల్ డ్రింక్స్ కోసం రెండు వేల నోట్ ఇవ్వగా.. షాప్ యజమానికి అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. దీంతో దొంగ నోట్ల ముఠా భాగోతం బయటికి వచ్చింది. తీగ లాగితే డొంక కదిలింది.

రెండు జిల్లాల్లో మొత్తం 8 మందిని పోలీసులు అరెస్టు చేశారు. కాకినాడ దగ్గర హోరంచి గ్రామానికి చెందిన అబ్దుల్ రెహమాన్ అనే వ్యక్తి ఈ ముఠాకు దొంగ నోట్లు ఇచ్చి చలామణి చేయిస్తున్నాడని తెలిపారు. బంగ్లాదేశ్ నుంచి ట్రెయిన్ ద్వారా దొంగ నోట్లను తీసుకురావడం జరుగుతోంది. 

కొండవల నాగవెంకట సత్యనారాయణ, రౌతు జయరామ్, బొత్తన పద్మారావులు దొంగ నోట్ల చలామణిలో కీలక పాత్ర పోషించినట్లు పోలీసులు గుర్తించారు. పరారీలో ఉన్న ఇద్దరి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. దొంగ నోట్ల చలామణి కొంతకాలంగా గుట్టుచప్పుడు కాకుండా జరుగుతోంది. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దొంగ నోట్లను ఎక్కడ ముద్రించారన్న కోణంలో విచారణ చేపట్టారు.