చెత్తలో రూ.5 కోట్లు : 19 కిలోల బంగారం సీజ్

ముంబై : బంగారం స్మగ్లర్లు రెచ్చిపోతున్నారు. అధికారులు ఎంత నిఘా పెడుతున్నా.. ఏదో విధంగా స్మగ్లింగ్ చేస్తున్నారు.

  • Published By: veegamteam ,Published On : April 6, 2019 / 11:41 AM IST
చెత్తలో రూ.5 కోట్లు : 19 కిలోల బంగారం సీజ్

ముంబై : బంగారం స్మగ్లర్లు రెచ్చిపోతున్నారు. అధికారులు ఎంత నిఘా పెడుతున్నా.. ఏదో విధంగా స్మగ్లింగ్ చేస్తున్నారు.

ముంబై : బంగారం స్మగ్లర్లు రెచ్చిపోతున్నారు. అధికారులు ఎంత నిఘా పెడుతున్నా.. ఏదో విధంగా స్మగ్లింగ్ చేస్తున్నారు. స్మగ్లర్ల తెలివితేటలకు అధికారులు షాక్ అవుతున్నారు. చెత్త రూపంలో బంగారం స్మగ్లింగ్ చేసిన ఘటన ముంబైలో వెలుగుచూసింది. స్మగ్లర్ ఎంతో తెలివిగా వ్యవహరించినా దొరికిపోయాడు. రూ.5.4 కోట్ల విలువ చేసే 19 కిలోల బంగారాన్ని డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు పట్టుకున్నారు. ఇత్తడి పైపుల్లో దాచిన గోల్డ్ ని సీజ్ చేశారు.
Read Also : కాంగ్రెస్ గూటికి చేరిన బీజేపీ రెబల్ లీడర్

రాజేష్ అనే వ్యక్తి దుబాయ్ నుంచి స్క్రాప్ ను దిగుమతి చేసే వ్యాపారం చేస్తున్నాడు. తాజాగా 100 టన్నుల స్క్రాప్ ను 5 కంటైనర్లలో దిగుమతి చేసుకున్నాడు. వాటి మధ్యలో మూడు ఇత్తడి పైపులు ఉన్నాయి. గోల్డ్ స్మగ్లింగ్ గురించి పక్కా సమాచారం అందుకున్న అధికారులు స్క్రాప్ ను ముమ్మరంగా చెక్ చేశారు. ప్లాస్టిక్, పేపర్, ఐరన్ వ్యర్థాల మధ్య వారికి 3 ఇత్తడి పైపులు కంటపడ్డాయి. డౌట్ వచ్చి వాటిని తెరిపించారు. అందులో 163 గోల్డ్ బిస్కెట్లు బయటపడ్డాయి. దీంతో అధికారులు షాక్ తిన్నారు.

రాజేష్ గతంలో ప్రొటీన్ పౌడర్ దిగుమతి వ్యాపారం చేసేవాడు. ఆ తర్వాత బంగారం స్మగ్లర్ గా మారాడని పోలీసులు చెప్పారు. ఆ గోల్డ్ ఎవరి కోసం తెప్పించాడు, ఇంకా ఈ రాకెట్ లో ఎంతమంది ఉన్నారు అనే వివరాలు తెలుసుకునే పనిలో ఉన్నారు. వారం రోజుల వ్యవధిలో డీఆర్ఐ అధికారులు ఇంత పెద్ద ఎత్తున బంగారం పట్టుకోవడం ఇది రెండోసారి. గత వారం అక్రమంగా తీసుకొచ్చిన 110 కిలోల గోల్డ్ ను స్వాధీనం చేసుకున్నారు. ఏప్రిల్ 2018, ఏప్రిల్ 2019 మధ్య డీఆర్ఐ అధికారులు 210 కిలోల బంగారం సీజ్ చేశారు.
Read Also : కోయంబత్తూరు లో 149 కేజీల బంగారం స్వాధీనం :ఎన్నికల తనిఖీలు