Vikarabad: ఆర్టీసీ బస్సు బ్రేకులు ఫెయిల్.. ఒకరి మృతి.. పలువురికి గాయాలు

వికారాబాద్ జిల్లాలో ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో ఒకరు మరణించగా, మరి కొందరు గాయపడ్డారు. వికారాబాద్ డిపో నుంచి బస్సు ధరూర్ జాతరకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. బస్సు బ్రేకులు ఫెయిల్ కావడమే ఘటనకు కారణమని తెలుస్తోంది.

Vikarabad: ఆర్టీసీ బస్సు బ్రేకులు ఫెయిల్.. ఒకరి మృతి.. పలువురికి గాయాలు

Vikarabad: వికారాబాద్ జిల్లాలో ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురైంది. ప్రాథమిక సమాచారం ప్రకారం.. బస్సు బ్రేకులు ఫెయిల్ కావడంతో ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఒక మహిళ మృతి చెందగా పలువురు గాయపడ్డారు. అనంతగిరి హిల్స్ వద్ద ఆదివారం ఈ ఘటన జరిగింది.

Suryakumar Yadav: సెంచరీతో చెలరేగిన సూర్య కుమార్.. న్యూజిలాండ్‌పై 65 పరుగుల తేడాతో ఇండియా ఘన విజయం

వికారాబాద్ డిపోకు చెందిన బస్సు ధరూర్ జాతరకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. గుట్ట దిగుతుండగా, బస్సు బ్రేకులు ఫెయిలయ్యాయి. దీంతో బస్సు వేగంగా గుట్ట కిందకు దూసుకెళ్లింది. ఈ సమయంలో ప్రయాణికులు ఒక్కొక్కరూ బస్సులోంచి కిందకు దూకేందుకు ప్రయత్నించారు. కిందకు దూకేటప్పుడు ఒక మహిళ బస్సు కింద పడి ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటనలో పలువురు ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాద సమయంలో బస్సులో 70 మంది వరకు ప్రయాణికులు ఉన్నారు. ఘటన సమాచారం అందుకున్న పోలీసులు, అధికారులు ప్రమాద స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మహిళ మృతదేహాన్ని పోస్టుమార్టమ్ కోసం వికారాబాద్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

Warangal: విద్యార్థినుల మధ్య ఘర్షణ.. మనస్తాపంతో బాలికల ఆత్మహత్యాయత్నం

మరోవైపు గుట్ట దగ్గర కిందికి దిగుతుండగా బ్రేకులు ఫెయిలయ్యాయని డ్రైవర్ తెలిపారు. ఈ ఘటనలో ఆర్టీసీ అధికారుల నిర్లక్ష్యమే కారణమని అనుమానాలు తలెత్తుతున్నాయి. బస్సుకు బ్రేకులు సరిగ్గా లేవని, డ్రైవర్ ముందుగానే డిపోలో చెప్పినట్లు సమాచారం. అయినప్పటికీ బస్సును వికారాబాద్ డిపో అధికారులు బయటకు పంపారు. దీంతో ప్రమాదం జరిగింది. ఈ ఘటనపై అధికారులు పూర్తి స్థాయి దర్యాప్తు జరుపుతున్నారు.