కర్నూలు జిల్లా రుద్రవరం ఎస్ఐ కధ సుఖాంతం

  • Published By: chvmurthy ,Published On : March 1, 2020 / 09:52 AM IST
కర్నూలు జిల్లా  రుద్రవరం ఎస్ఐ కధ సుఖాంతం

సూసైడ్ మెసేజ్ పెట్టి ఇంటి నుంచి వెళ్లిపోయిన కర్నూలు జిల్లా రుద్రవరం ఎస్ ఐ విష్ణు నారాయణ కధ సుఖాంతమైంది. ఆయన బనగాన పల్లి లోని  బ్రహ్మంగారి మఠంలో ఉన్నట్లు గుర్తించి ఆయన్ను అక్కడినుంచి  ఆళ్ళగడ్డకు తరలించారు. 

కాగా, విధుల్లో నిర్లక్ష్యం వహించారంటూ ఎస్పీ హెడ్ క్వార్టర్స్ నుంచి ఎస్ఐ విష్ణునారాయణకు పిలుపురావడంతో ఆయన వెళ్లారు. రుద్రవరంలో ఓ గొడవ కేసులో ఎస్పీ ఆదేశించినప్పటికీ కేసు నమోదు విషయంలో ఆలస్యం చేశారనే కారణంతో ఎస్ఐని పిలిపించినట్లు తెలిసింది. రెండ్రోజుల ఆలస్యంగా కేసులు నమోదు చేయడంపై ఎస్ఐని మందలించినట్లు సమాచారం. ఈ క్రమంలో మనస్తాపం చెందిన ఎస్ఐ విష్ణునారాయణ ఇంటికి వచ్చి కుటుంబసభ్యులతో తన ఆవేదనను పంచుకున్నారు. ఆ తర్వాత ఇదే నా చివరి మెసేజ్ అంటూ పోలీసు అధికారుల వాట్సాప్‌లో సందేశం పెట్టాడు. 
 
‘ఈ మెసేజ్ చదివే సమయానికి నేను బతకకపోవచ్చు లేక చనిపోవచ్చు. దయచేసి నన్ను అందరూ చెడుగా అనుకోవద్దు’ అని ఎస్ఐ తన వాట్సాప్ సందేశంలో ఇతర సభ్యులుకు తెలియజేశారు. కాగా, ఆళ్లగడ్డ డీఎస్పీ ఆ సందేశం చూసి ఆ రాత్రే ఎస్ఐ ఇంటికి వెళ్లారు. సీఐతోపాటు డీఎస్పీ ఎస్ఐ ఇంటికి వచ్చి విష్ణునారాయణకు నచ్చజెప్పారు. ఆవేశంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దని కోరారు. ఎస్‌ఐ కుటుంబీకులను సముదాయించారు.
 
అయినప్పటికీ ఆదివారం తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో ఎస్ఐ విష్ణునారాయణ ఇంటి నుంచి కారులో బయటకు వెళ్లిపోయారు. విష్ణునారాయణ ఇంటి నుంచి కారులో బయటకు వెళ్లిపోయిన సంగతి కుటుంబ సభ్యులు డీఎస్పీ కి చెప్పటంతో అలర్టైన అధికారులు విష్ణునారాయణన గురించి ఎంక్వైరీ చేశారు.ఆయన బ్రహ్మం గారి మఠంలో ఉండటంతో పోలీసు సిబ్బందిని పంపించి ఆయన్ను ఆళ్ళగడ్డకు తీసుకువచ్చారు