Singareni Colony Rape Case : సింగరేణి కాలనీ చిన్నారి హత్య కేసు నిందితుడు అరెస్ట్ ?

సైదాబాద్  సింగరేణి కాలనీలోని చిన్నారి హత్యకేసు నిందుతుడు రాజు పోలీసులు అదుపులోనే ఉన్నట్లు సమాచారం.

Singareni Colony Rape Case : సింగరేణి కాలనీ చిన్నారి హత్య కేసు నిందితుడు అరెస్ట్ ?

Saidabad Singareni Colony Accused Raju

Singareni Colony Rape Case :  సైదాబాద్  సింగరేణి కాలనీలోని చిన్నారి హత్యకేసు నిందుతుడు రాజు పోలీసులు అదుపులోనే ఉన్నట్లు సమాచారం. ఘటన జరిగిన మరుసటిరోజే యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరులో  రాజును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈవిషయాన్ని ఐటీ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు.

Read Also : Atrocity In Hyderabad : హైదరాబాద్‌లో దారుణం…చిన్నారిపై అత్యాచారం చేసి హత్య చేసిన యువకుడు

సైదాబాద్ ఘటన జరిగిన కొద్ది గంటల్లోనే నిందితుడు రాజు ను అరెస్ట్ చేసినట్లు తన ట్విట్టర్ లో పేర్కొన్న మంత్రి కేటీఆర్..తగిన విధంగా బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని హోమ్ మంత్రి & డిజిపి కి ట్వీట్ చేసారు. దీంతో మంత్రిచేసిన ట్వీట్ గందరగోళానికి దారితీస్తోంది. కాగా పోలీసులు ఇంకా నిందితుడి కోసం గాలిస్తున్నామని చెపుతున్నారు. దాదాపు 100 మంది పోలీసులతో ప్రత్యేక టీమ్స్ రంగంలోకి దిగి రాజుకోసం గాలిస్తున్నట్లు పోలీసులు చెపుతున్నారు.