ప్రేమ, పెళ్లి పేరుతో వాడుకున్నాడు….కన్నడ నటి సెల్ఫీ సూసైడ్ 

  • Published By: murthy ,Published On : June 2, 2020 / 04:11 AM IST
ప్రేమ, పెళ్లి పేరుతో వాడుకున్నాడు….కన్నడ నటి సెల్ఫీ సూసైడ్ 

వెండి తెరపై వెలిగిపోవాలని పల్లె నుంచి పట్నానికి వచ్చింది. టీవీ సీరియల్స్, వాణిజ్య ప్రకటనల్లోనూ.. నటిగా పేరు సంపాదించుకుంది. సినిమాల్లోనూ చిన్న చిన్న పాత్రల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. ప్రేమ, పెళ్ళి పేరుతో దగ్గరైన యువకుడ్ని నమ్మింది. ఐదేళ్ళుగా ఇద్దరూ ప్రేమలో మునిగి తేలారు. తన సంపాదనతో జల్సాలు చేశారు. ప్రియుడు కూడా మంచి ఉద్యోగం చేస్తున్నాడు… మోసం జరగదు అనుకుంది. ఇక ఎట్టాగూ పెళ్లి చేసుకుంటాం కదా అని శారీరకంగా కలిశారు. పెళ్లి చేసుకోమని ఒత్తిడి చేసే సరికి ప్రియుడు మాట మార్చాడు.  ఆ షాక్  తట్టుకోలేని నటి పురుగుల మందు తాగుతూ సెల్ఫీ వీడియో తీసుకుని జీవితాన్ని ముగించింది. chandana 1

కర్ణాటకలోని హాసన్ జిల్లా బేలూరు కు చెందిన చందన (29) రైతు కుటుంబంలో పుట్టింది. తండ్రి వ్యవసాయం చేస్తాడు. సినిమాల్లో నటించాలనే  కోరికతో బెంగుళూరు కు వచ్చి తావరకెరెలోని క్రిష్ణమూర్తి లేఔట్ లో నివాసం ఉంటూ, టీవీ సీరియల్స్ తో పాటు వాణిజ్య ప్రకటనల్లో నటిస్తూ పేరు తెచ్చుకుంది. బెంగుళూరులో  ప్రముఖ కంపెనీలో ఉద్యోగం చేస్తున్న దినేష్ అనే యువకుడితో చందన ప్రేమలో పడింది.

 chandana 2

ఎప్పటికైనా దినేష్ ను పెళ్లి చేసుకుని జీవితంలో పిల్లా పాపలతో కలిసి సంతోషంగా గడపాలని ఎన్నో కలలుకంది. తన సంపాదించిన దానితో దినేష్ తో కలిసి ప్రేమ లోకంలో విహరించింది. ఐదేళ్లపాటు ఇద్దరూ ఆనందపు అంచులు చవి చూశారు. ఇటీవల చందన పెళ్లి చేసుకుందామని దినేష్ ను ఒత్తిడి చేయసాగింది. పెళ్లి మాటెత్తే సరికి దినేష్ మాట మార్చేసేవాడు. చందన పెళ్లి విషయంలో పట్టుబట్టటంతో దినేష్ కు  ఏం చేయాలో అర్ధంకాలేదు.
sandel wood chandana
తాను దినేష్ నే పెళ్లి చేసుకుంటానని ,తన తల్లితండ్రులకు చెప్పి వారింటికి పంపించింది చందన.  కూతురు ఇష్టపడిన వ్యక్తితోనే పెళ్లి చేసేందుకు సిధ్ధపడిన చందన పేరెంట్స్ దినేష్ ఇంటికి వెళ్లి పెళ్లి విషయం ప్రస్తావించారు. అక్కడ వారికి నిరాశే ఎదురయ్యింది. చందన గురించి చెడుగా మాట్లాడుతూ…..ఆమె క్యారెక్టర్ సరిగా లేదని, ఆమె ఎవరితో పడితే వారితో తిరుగుతుందని అలాంటి అమ్మాయిని కోడలుగా చేసుకోలేమని దినేష్ తల్లి గాయత్రి, తండ్రి దయానంద్ తేల్చి చెప్పారని తెలిసింది. ఈ ఐదేళ్లకాలంలో  దినేష్, చందనలు ఇద్దరూ హద్దులు దాటి ప్రవర్తించటంతో ఆమె గర్బం దాల్చింది. ఈ క్రమంలో దినేష్ ఆమెకు అబార్షన్ చేయించాడని తెలిసింది.
chandana 3

దినేష్ కుటుంబ సభ్యులు  పెళ్లికి నిరాకరించటంతో వారి పెళ్లి క్యాన్సిల్ అయ్యింది. తన తల్లి తండ్రులు పెళ్లికి అంగీకరించట్లేదని, నిన్నుపెళ్లిచేసుకోలేనని దినేష్  తేల్చి చెప్పాడు. నేను సంపాదించిన డబ్బులతో ఐదేళ్లుగా నువ్వు నీ జల్సాల కోసం ఖర్చు చేసుకున్నావని, ఇప్పుడు పెళ్లి చేసుకోనని ఎలా చెబుతావని నటి చందన ప్రియుడు దినేష్ ను నిలదీసింది.
.chandana suide

పెళ్లి చేసుకునే విషయంలో దినేష్ మోసం చేసాడని గ్రహించిన చందన బాధతో కుమిలిపోయింది. జూన్ 1వ తేదీ సోమవారం సూసైడ్ నోట్ రాసి  పురుగుల మందు తాగుతూ సెల్ఫీ సూసైడ్ వీడియో తీసుకుంది. సెల్ఫీ వీడియోలో దినేష్ ను ఎంతగా  ప్రేమించింది. ఎంతగా నమ్మింది, పెళ్లి చేసుకుంటానని చెప్పి దినేష్ తనను శారీరకంగా ఎలా వాడుకున్నది, తన సంపాదనను ఎలా జల్సాలకు ఖర్చు పెట్టించిన అన్నీవిషయాలు చెప్పింది. దినేష్ మాటలు నమ్మి తాను ఎలా మోసపోయింది విపులంగా వివరించింది.  
chandana selfie suicide
పెళ్లి చేసుకోమంటే ..చేసుకోనని ఎదురు తిరిగావు..ఈ గ్లాసులో ఉన్న  విషం తాగి ఆత్మహత్య చేసుకుంటున్నాను.  నువ్వునన్ను మోసం చేసినట్లు ఇంకెవర్నీ మోసం చేయకు..నువ్వుసంతోషంగా ఉండు అంటూ గ్లాసులోని పురుగుల మందు తాగి వీడియోను ప్రియుడికి వాట్సప్ చేసింది. గ్లాసులో ఉన్న పురగుల మందుతాగటంతో కొద్దిసేపటికే చందన కుప్పకూలిపోయింది.

చందన సెల్ఫీ వీడియో వాట్సప్ లో రిసీవ్ చేసుకున్న దినేష్ హుటా హుటిన చందన ఇంటికి వచ్చాడు.  అపస్మారక స్ధితిలోకి వెళ్ళిన చందనను  ఆస్పత్రికి తీసుకువెళ్లాడు.ఆస్పత్రికి తెచ్చేసరికే చందన మృతిచెందిందని డాక్టర్లు చెప్పటంతో  దినేష్ ఆస్పత్రి నుంచి పరారయ్యాడు. 

చందన సూసైడ్ చేసుకుందనే విషయం తెలిసిన ఆమె మామ సంతోష్ ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దినేష్ కోసం గాలిస్తున్నారు.  దినేష్ మోసం చేయటం, దినేష్ కుటుంబ సభ్యులు ఆమె శీలాన్ని శంకించి అవమానకరంగా మాట్లాడం వల్లే ఆత్మ హత్య చేసుకుందనే కారణంతో దినేష్ తల్లితండ్రులతో సహా ఐదుగురి మీద కేసు నమోదు చేసినట్లు సుద్దగుంట పాళ్యేం పోలీసులు తెలిపారు. వర్ధమాన నటి ఆత్మహత్య చేసుకోవటంతో శాండల్ ఉడ్ టీవీ పరిశ్రమ నివ్వెరపోయింది. 

Read: రచయిత జొన్నవిత్తులపై అట్రాసిటీ కేసు