ఖమ్మం అసిస్టెంట్ లేబర్ కమిషనర్ హత్య కేసులో సీన్ రికన్‌స్ట్రక్షన్‌

ఖమ్మం లేబర్ అసిస్టెంట్ కమిషనర్ హత్యకేసులో పోలీసులు సీన్‌ రీ కన్‌స్ట్రక్షన్ చేస్తున్నారు. ఈ కేసులో ఆరుగురు నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు... రాంపూర్‌ అడవుల్లోని ఘటనా స్థలానికి తీసుకువెళ్లారు.

  • Published By: veegamteam ,Published On : March 11, 2020 / 04:50 AM IST
ఖమ్మం అసిస్టెంట్ లేబర్ కమిషనర్ హత్య కేసులో సీన్ రికన్‌స్ట్రక్షన్‌

ఖమ్మం లేబర్ అసిస్టెంట్ కమిషనర్ హత్యకేసులో పోలీసులు సీన్‌ రీ కన్‌స్ట్రక్షన్ చేస్తున్నారు. ఈ కేసులో ఆరుగురు నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు… రాంపూర్‌ అడవుల్లోని ఘటనా స్థలానికి తీసుకువెళ్లారు.

ఖమ్మం లేబర్ అసిస్టెంట్ కమిషనర్ హత్యకేసులో పోలీసులు సీన్‌ రీ కన్‌స్ట్రక్షన్ చేస్తున్నారు. ఈ కేసులో ఆరుగురు నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు… వారిని జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా రాంపూర్‌ అడవుల్లోని ఘటనా స్థలానికి తీసుకువెళ్లారు. ఐదుగురు నిందితులను వాహనాల్లోనే ఉంచిన పోలీసులు.. నిందితుల్లో ఒకడైన శివరామకృష్ణను మాత్రం హత్య జరిగిన చోటుకి తీసుకెళ్లారు. ఆనందర్ రెడ్డిని నరికి చంపిన తర్వాత సమీపంలోని పొదల్లో మారణాయుదాలు విసిరేసినట్లు నిందితులు తెలపడంతో.. పోలీసులు వాటిని స్వాధీనం చేసుకునేందుకు ముమ్మరంగా గాలిస్తున్నారు. 

పక్కా ప్లాన్‌ ప్రకారమే హత్య 
ఆనంద్‌రెడ్డి హత్యకేసులో సంచలన విషయాలు వెలుగు చూశాయి. స్నేహం ముసుగులో ఆరుగురు వ్యక్తులు ఆనంద్ రెడ్డిని పక్కా ప్లాన్‌ ప్రకారం అత్యంత దారుణంగా హత్య చేసినట్లు తేలింది. అప్పు తీర్చమన్నందుకు అంతం చేసినట్లు పోలీసులు గుర్తించారు. తీసుకున్న అప్పుకు భూమి రాసిస్తానని నమ్మించిన స్నేహితుడు..  నాలుగు రోజుల క్రితం మరో ఐదుగురితో కలిసి అడవుల్లోకి తీసుకెళ్లాడు. అక్కడ అందరూ కలిసి ఆనంద్‌రెడ్డి చేతులు కట్టేశారు. ఆ తర్వాత గొంతుకోసి హత్య చేశారు. ఆలస్యంగా వెలుగుచూసిన ఈ ఘటనలో… ఆనంద్‌రెడ్డి మృతదేహం పూర్తిగా కుల్లిపోయినట్లు తెలుస్తోంది. 

డబ్బుల విషయంలో వివాదం
జనగామ జిల్లా ఓబుల్‌కేశపూర్‌కు చెందిన ఆనంద్‌రెడ్డి… మొదట జనగామ, వరంగల్‌లో అసిస్టెంట్‌ లేబర్‌ కమిషనర్‌గా  విధులు నిర్వహించారు. ప్రస్తుతం ఇన్‌చార్జి అసిస్టెంట్‌ లేబర్‌ కమిషనర్‌గా ఖమ్మంలో పనిచేస్తున్నారు. తరచుగా హన్మకొండకు వచ్చే ఆయన.. ఇక్కడే స్థిర నివాసం ఏర్పాటు  చేసుకున్నారు. ఆనంద్‌ రెడ్డికి… వరంగల్‌ అర్బన్‌ జిల్లా శనిగరానికి చెందిన ప్రదీప్‌రెడ్డి స్నేహితుడు. ఇద్దరూ కలిసి ఇసుక వ్యాపారం చేశారు. 80 లక్షల నుంచి 90 లక్షల వరకు పెట్టుబడి పెట్టారు. ఈ డబ్బుల విషయంలోనే వారిద్దరి మధ్య వివాదం చెలరేగింది.

వాటాకన్నా ప్రదీప్‌రెడ్డికి అధనంగా డబ్బులు    
వ్యాపార లావాదేవీల్లో భాగంగా ప్రదీప్‌రెడ్డికి అతడి వాటాకంటే అధికంగా ఆనంద్‌ డబ్బులు ఇచ్చినట్లు  బంధువులు చెబుతున్నారు. అదనంగా ఇచ్చిన ఆ డబ్బులను తిరిగిచ్చేస్తానన్న ప్రదీప్‌… ఇప్పటికీ ఆ డబ్బును ఇవ్వలేదు. పలుమార్లు వాయిదాలు వేస్తూ వచ్చాడు. దీంతో ఈ నెల 7న హన్మకొండలోని ఓ హోటల్‌లో కొంతమంది సమక్షంలో డబ్బుల విషయమై పంచాయతీ జరిగింది. మొత్తం డబ్బు ఇవ్వలేనన్న ప్రదీప్‌రెడ్డి… భూపాలపల్లిలో కొంత భూమి, కొంత డబ్బు ఇస్తానని చెప్పాడు.

ఆనంద్‌రెడ్డిని అడవుల్లోకి తీసుకెళ్లిన ప్రదీప్ రెడ్డి 
పంచాయతీ తర్వాత అదేరోజు ఉదయం 9 గంటలకు ఆనంద్‌రెడ్డి, ప్రదీప్‌రెడ్డితోపాటు మిగతా ఐదుగురు వ్యక్తులు కలిసి కారులో భూపాలపల్లికి బయలుదేరారు. అయితే… ముందు… పార్టీ చేసుకుందామని, ఆ తర్వాత భూమి రిజిస్ట్రేషన్ చేసుకుందామన్న ప్రదీప్‌…. ఆనంద్‌రెడ్డిని రాంపూర్‌ సమీపంలోని అడవుల్లోకి తీసుకెళ్లాడు. ఆ తర్వాత ఆనంద్‌రెడ్డి ఫోన్‌ స్విచ్ఛాఫ్‌ అయింది. అయితే.. ఆరోజు ఆనంద్‌ రెడ్డి తిరిగిరాకపోవడంతో మరునాడు అతడి సోదరుడు శివకుమార్‌రెడ్డి హన్మకొండ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.   

అటవీ ప్రాంతంలో ఆనంద్ రెడ్డి మృతదేహం
మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు… నాలుగు బృందాలుగా ఏర్పడి ఆనంద్‌రెడ్డి కోసం గాలించారు. అతడి సెల్‌ఫోన్‌ సిగ్నల్‌ ఆధారంగా ఈ నెల 9న అటవీ  ప్రాంతంలో గాలించారు. కానీ ఫలితం దక్కలేదు. ఆ తర్వాత అనుమానితులపై దృష్టిపెట్టి విచారణ చేపట్టారు. దీంతో ప్రదీప్‌రెడ్డి బండారం బయటపడింది. అతడితోపాటు మరో ఐదుగురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిన్న రాత్రి కూడా హన్మకొండ ఏసీపీ జితేందర్‌రెడ్డి ఆధ్వర్యలో వారిని ఘటనా స్థలానికి తీసుకెళ్లారు. అడవిలోని ఓ ప్రాంతంలో దుర్వాసన రావడంతో అక్కడికి వెళ్లి చూసిన పోలీసులు… అది ఆనంద్‌రెడ్డిదేనని గుర్తించారు.