transfer certificate కోసం వెళితే..అత్యాచారం చేసిన స్కూల్ ఛైర్మన్

  • Published By: madhu ,Published On : September 11, 2020 / 08:21 AM IST
transfer certificate కోసం వెళితే..అత్యాచారం చేసిన స్కూల్ ఛైర్మన్

Greater Noida : విద్యా బుద్దులు చెప్పి సన్మానమార్గంలో పయనించాలని చెప్పాల్సిన టీచర్స్ లలో కొంతమంది.సభ్య సమాజం తలదించుకొనేలా వ్యవహరస్తున్నారు. విద్యార్థులపై అత్యాచారాలకు పాల్పడుతూ ఆ వ్యవస్థకే మచ్చ తెస్తున్నారు.




తన సోదరుడి ట్రాన్స్ ఫర్ సర్టిఫికేట్ తీసుకెళ్లడానికి వెళ్లిన 20 ఏళ్ల విద్యార్థిపై ప్రైవేటు పాఠశాల ఛైర్మన్ అత్యచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన యూపీలోని గ్రేటర్ నోయిడాలో చోటు చేసుకుంది.

అతనిపై కేసు నమోదు చేశామని గౌతమ్ బుధ్ద నగర్ Deputy Commissioner of Police (Women Security), బృందా శుక్లా తెలిపారు. దర్యాప్తు చేస్తున్నామన్నారు.