ఐటీ ఉద్యోగి క్రిమినల్ స్కెచ్ : పదేళ్ల తర్వాత వాట్సాప్ ద్వారా కలిశారు.. ఇద్దరూ కలిసి భార్యను చంపారు

ఐటీ ఉద్యోగి వేసిన క్రిమినల్ స్కెచ్ అని తెలిసిన పోలీసులు షాక్ అయ్యారు. ఈ క్రైం స్టోరీ.. జార్ఖండ్ లోని సింద్రి, ధాన్ బాద్ లో జరిగింది. 

  • Published By: sreehari ,Published On : May 4, 2019 / 11:05 AM IST
ఐటీ ఉద్యోగి క్రిమినల్ స్కెచ్ : పదేళ్ల తర్వాత వాట్సాప్ ద్వారా కలిశారు.. ఇద్దరూ కలిసి భార్యను చంపారు

ఐటీ ఉద్యోగి వేసిన క్రిమినల్ స్కెచ్ అని తెలిసిన పోలీసులు షాక్ అయ్యారు. ఈ క్రైం స్టోరీ.. జార్ఖండ్ లోని సింద్రి, ధాన్ బాద్ లో జరిగింది. 

ఒకే స్కూల్లో కలిసి చదువుకున్నారు. ఉన్నత చదువుల కోసం దూరమయ్యారు. పదేళ్ల తర్వాత స్కూల్ వాట్సాప్ గ్రూపు ద్వారా మళ్లీ కలుసుకున్నారు. వాట్సాప్ గ్రూపు ఇద్దరి మనస్సులను ఒకటి చేసింది. చిన్ననాటి స్నేహం.. కాస్త ప్రేమగా మారింది. పీకల్లోతు ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకోవడమే మిగిలింది. కట్ చేస్తే… ప్రియుడికి పెళ్లి కుదిరింది. ఇంట్లో వాళ్లు బలవంతంగా మరో అమ్మాయితో పెళ్లి చేశారు. పెళ్లి అయ్యాక భార్య అడ్డు తొలగించు కోవాలనుకున్నాడు. తన ప్రియురాలితో కలిసి మర్డర్ ప్లాన్ చేసి భార్యను దారుణంగా చంపేశాడు. ఇదంతా నిందితుడు ఐటీ ఉద్యోగి వేసిన క్రిమినల్ స్కెచ్ అని తెలిసిన పోలీసులు షాక్ అయ్యారు. ఈ క్రైం స్టోరీ.. జార్ఖండ్ లోని సింద్రి, ధాన్ బాద్ లో జరిగింది. 

వివరాల్లోకి వెళితే..  జార్ఖండ్ కు చెందిన రాహుల్ మిశ్రా, పద్మ తివారీ ఇద్దరు చిన్ననాటి స్నేహితులు. కైండర్ గార్టెన్ స్కూల్లో ఇద్దరు కలిసి చదువుకున్నారు. పదో తరగతిలో ఇద్దరు ప్రేమలో పడ్డారు. ఆ తర్వాత హైయర్ స్టడీస్ కోసం దూర ప్రాంతాలకు వెళ్లడంతో లవ్ కు బ్రేక్ పడింది. రాహుల్ ఇంటర్ తర్వాత ధాన్ బాద్ వదిలి గ్వాలియర్ లో మెకానికల్ ఇంజినీరింగ్ చదివేందుకు వెళ్లాడు. పద్మ కూడా బయోటెక్నాలజీ కోర్సు కోసం నోయిడా వెళ్లిపోయింది.

10ఏళ్ల తర్వాత మళ్లీ ప్రేమ :
నాలుగేళ్ల తర్వాత రాహుల్ కు గుర్గావ్ లోని MNC కంపెనీలో ఉద్యోగం వచ్చింది. పద్మ ఎంబీఏ చదువుతోంది. 2012లో ఢిల్లీలో ఆమెకు ఉద్యోగం వచ్చింది. 2015 వరకు రాహుల్, పద్మ కలుసుకోలేదు. పదేళ్ల తర్వాత స్కూల్ వాట్సాప్ గ్రూపు ద్వారా మళ్లీ రాహుల్, పద్మ కలుసుకున్నారు. మళ్లీ ప్రేమ చిగురించింది. పెళ్లి చేసుకోవాలనుకున్నారు.  అయితే వీరిద్దరి కులాలు వేర్వేరు కావడంతో పెద్దలు పెళ్లికి ఒప్పుకోలేదు. 

2017లో పూజతో పెళ్లి :
అదే సమయంలో పేరెంట్స్ బలవంతపెట్టడంతో 2017, ఏప్రిల్ 23న పూజా రాయ్ అనే అమ్మాయిని రాహుల్ పెళ్లి చేసుకున్నాడు. పెళ్లికి కొన్ని రోజుల ముందే కాబోయే భార్య పూజకు తన ప్రేమ విషయం చెప్పాడు. కానీ, పెద్దలు కుదిర్చిన పెళ్లి ఎక్కడ ఆగిపోతుందోనని ఆమె భయపడింది. పద్మతో రిలేషన్ షిప్ వదిలేసుకోమని చెప్పేసింది. కేవలం స్నేహితులుగా ఉండమని చెప్పింది.. దాంతో రాహుల్, పూజల పెళ్లి జరిగి పోయింది.

ప్రియురాలిని భార్యకు పరిచయం చేసి: 
2018 అక్టోబర్ లో పూజా రాయ్ ఉద్యోగం కోసం సెర్చ్ చేస్తోంది. రాహుల్.. తన ప్రేయసి పద్మ.. అంటూ పూజకు పరిచయం చేశాడు. పద్మ పనిచేసే కంపెనీలో జాబ్ ఇప్పిస్తామంటూ తన రెజ్యుమ్ పంపమని చెప్పాడు. అది నమ్మిన పూజ.. రాహుల్, పద్మల మధ్య స్నేహం మాత్రమే ఉందని భ్రమపడింది. ఆఫీసులో పని అయ్యాక.. పద్మతో టచ్ లో ఉండమంటూ భార్య పూజకు చెప్పుకొచ్చాడు. అప్పుడే అసలు విషయం పూజకు తెలిసిపోయింది. రాహుల్, పద్మల మధ్య ప్రేమ కొనసాగుతున్నట్టు గ్రహించింది. ఈ క్రమంలో రాహుల్, పూజ మధ్య గొడవలు మొదలయ్యాయి. 

గూగుల్లో సెర్చ్.. యూట్యూబ్ వీడియోలు చూసి మర్డర్ ప్లాన్ :
పూజ అడ్డు ఎలాగైనా తొలగించుకోవాలని పద్మ, రాహుల్ మర్డర్ ప్లాన్ కు స్కెచ్ వేశారు. భార్య పూజను ఎలా ఎన్నిరకాలుగా చంపాలి అనేదానిపై రాహుల్ గూగుల్లో సెర్చ్ చేశాడు. ఎవరికి అనుమానం రాకుండా ఎలా మర్డర్ చేయాలి అనేదానిపై ఇంటర్నెట్ లో చాలా యూట్యూబ్ వీడియోలు చూశాడు. చివరికి పూజను చంపేందుకు ఎలుక మందును ఎంచుకున్నారు.

జ్యూస్ లో ఎలుకల మందు కలిపి.. ప్రియుడికి మెసేజ్ :
మార్చి 16న పద్మ.. పూజ దగ్గరకు వచ్చి అప్యాయంగా పలకిరించింది. తనపై అనుమానం రాకుండా ఉండేందుకు ముందుగానే రాహుల్ తన ఆఫీసు కు వెళ్లిపోయాడు. అదే సమయంలో ఇంట్లో ఉన్న పూజతో మాట్లాడేందుకు ప్రియురాలు పద్మ వచ్చింది. మాటలు కలిపింది. బ్రేక్ ఫాస్ట్ చేద్దామని చెప్పి రెండు గ్లాసుల్లో జ్యూస్ తీసుకొచ్చింది. పనిమనిషి బయటకు వెళ్లగానే.. పూజకు ఎలుక మందు కలిపిన జ్యూస్ ను పద్మ ఇచ్చింది. పద్మ కపటి మాటలను నమ్మిన పూజ.. విషం కలిపిన జ్యూస్ ను తాగేసింది. స్పృహ కోల్పోయిన పూజ కాసేపటికి ప్రాణాలు విడిచింది. పద్మ వెంటనే అక్కడి నుంచి పరారు అయింది. ఆ తర్వాత వెంటనే ప్రియుడు రాహుల్ కి తన వాట్సాప్ ద్వారా పని పూర్తి అయింది అంటూ మెసేజ్ పెట్టింది. 

సూసైడ్ అంటూ రాహుల్ డ్రామా :
ఆఫీసు నుంచి ఇంటికి వెళ్లిన రాహుల్.. సూసైడ్ డ్రామా సార్ట్ చేశాడు. సూసైడ్ నోట్ తనే రాసి.. పూజనే రాసినట్టు అందరిని నమ్మించాడు. పూజను ఆస్పత్రికి తీసుకెళ్లాడు. అప్పటికే పూజ మృతిచెందినట్టు వైద్యులు వెల్లడించారు. రాహుల్ పై అనుమానంతో పోలీసులకు పూజ తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. రాహుల్, పూజల మ్యారేజ్ అయి.. 7ఏళ్లలోపే ఉండటం కారణంగా మెజిస్టీరియల్ ఎంక్వైరీ మొదలైంది. మార్చి 18న పూజ మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించగా.. ఏప్రిల్ 27న రిపోర్ట్ వచ్చింది. ఇందులో పూజకు గాయాలు ఉన్నాయని, హత్యకు గురైనట్టు తేలింది.

పోస్టుమార్టం రిపోర్ట్.. అసలు నిజం ఇదే :
ఏప్రిల్ 30 పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ కేసు మిస్టరీని ఛేదించేందుకు రంగంలోకి దిగిన ఏసీపీ ఈశ్వర్ సింగ్, ఇన్సెపెక్టర్లు రాజేశ్, సంజయ్ లతో కూడిన పోలీసుల బృందం లోతుగా దర్యాప్తు చేపట్టింది. విచారణలో పద్మ, రాహుల్ మధ్య ఫోన్ కాల్స్ సంభాషణ రికార్డు కాలేదు. కానీ, ఇరువురి మధ్య ఇంటర్నెట్ యాక్టివిటీ.. వాట్సాప్ చాటింగ్ జరిగినట్టు గుర్తించారు. రాహుల్, ప్రియురాలు పద్మను వేర్వేరుగా పోలీసులు తమదైన శైలిలో విచారించగా.. మొత్తం క్రైం హిస్టరీని రివీల్ చేశారు. తామే పూజను హత్య చేసేందుకు స్కెచ్ వేసినట్టు రాహుల్, పద్మ ఇద్దరూ నేరాన్ని అంగీకరించారు.