11 ఏళ్ల బాలికపై అత్యాచారం – ప్రిన్సిపాల్ కు ఉరిశిక్ష

11 ఏళ్ల బాలికపై అత్యాచారం – ప్రిన్సిపాల్ కు ఉరిశిక్ష

School Principal in Patna gets death sentence for raping calss 5 student : 11 ఏళ్ల బాలికపై అత్యాచారం చేసిన ఘటనలో ఒక స్కూల్ ప్రిన్సిపాల్ కు కోర్టు ఉరిశిక్ష విధించింది. అతనికి సహకరించిన మరో ఉపాధ్యాయుడికి యావజ్జీవ శిక్ష విధిస్తూ పాట్నాలోని పోక్సో ప్రత్యేక కోర్టు తీర్పు చెప్పింది.

బీహార్ రాష్ట్రం పాట్నాలోని పుల్వారీషరీఫ్ ప్రాంతంలోని ఒక పాఠశాలలో 11సంవత్సరాల బాలిక 5వ తరగతి చదువుతోంది. 2018వ సంవత్సరం, సెప్టెంబర్ నెలలో పాఠశాల ప్రిన్సిపాల్ అరవింద కుమార్ 11 సంవత్సరాల బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ దారుణం చేయటానికి ఉపాధ్యాయుడుగా పనిచేస్తున్న అభిషేక్ కుమార్ అరవింద్ కుమార్ కు సహకరించాడు.

ఈవిషయం బాలిక ఇంట్లో తల్లి తండ్రులకు చెప్పలేదు. కొన్నాళ్లకు బాలిక అస్వస్ధతకు గురైంది. దీంతో తల్లితండ్రులు బాలికను ఆస్పత్రికి తీసుకువెళ్లగా బాలిక గర్భవతి అని తేలింది. దీంతో బాలిక తల్లి ….ఏం జరిగిందో చెప్పమని నిలదీసింది. బాలిక జరిగిన విషయం అంతా తల్లికు వివరించింది.

దీంతో తల్లి తండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రిన్సిపాల్ పైనా, అతనికి సహకరించిన ఉపాధ్యాయుడిపైనా పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులు నేర నిరూపణ చేయగలగారు.

ఈకేసుకు సంబంధించి పాట్నా లోని ప్రత్యేక పోక్సో కోర్టు న్యాయమూర్తి అవథేష్ కుమార్ సోమవావారం తీర్పు వెలువరించారు.  ప్రిన్సిపాల్ కు మరణశిక్ష విధిస్తూ…లక్ష రూపాయలు జరిమానా కట్టాలని తీర్పు చెప్పారు. అదే విధంగా ప్రిన్సిపాల్ కు సహకరించిన ఉపాధ్యాయుడికి రూ.50 వేల జరిమానాతో పాటు యావజ్జీవ ఖైదు శిక్ష విధించారు.