Subba Rao : సుబ్బారావుకి రూ.50కోట్ల నష్టం..! అందుకే ఈ దుర్మార్గం.. సికింద్రాబాద్ విధ్వంసం కేసులో షాకింగ్ విషయాలు

కేంద్రం ప్రకటించిన అగ్నిపథ్ పథకం.. అతడికి పది కాదు 20 కాదు.. ఏకంగా రూ.50 కోట్ల నష్టం వచ్చే పరిస్థితి తెచ్చింది. అంతే, స్కెచ్ వేశాడు. పక్కాగా ప్లాన్ చేశాడు. కుట్రపన్ని అభ్యర్థులను రెచ్చగొట్టాడు. రైల్వే స్టేషన్ లో విధ్వంసం వెనుక మాస్టర్ మైండ్ అతడే.

Subba Rao : సుబ్బారావుకి రూ.50కోట్ల నష్టం..! అందుకే ఈ దుర్మార్గం.. సికింద్రాబాద్ విధ్వంసం కేసులో షాకింగ్ విషయాలు

Subba Rao : దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో విధ్వంసం కేసులో సిట్ అధికారులు విచారణ వేగవంతం చేశారు. ఆర్మీ రిక్రూట్ మెంట్ అభ్యర్థులను రెచ్చగొట్టి వారితో విధ్వంసం చేయించినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న సాయి డిఫెన్స్ అకాడమీ డైరెక్టర్ సుబ్బారావుని పోలీసులు విచారిస్తున్నారు. ఈ విచారణలో కీలక విషయాలు రాబట్టారు. విధ్వంసం వెనుక సుబ్బారావు హస్తం ఉందని తేల్చరు. 10కి పైగా వాట్సాప్ గ్రూప్ లు క్రియేట్ చేసి పక్కా ప్లాన్ తోనే సుబ్బారావు విద్యార్థులను రెచ్చగొట్టాడని నిర్ధారించారు. దీంతో సుబ్బారావుతో సహా నిన్న అదుపులోకి తీసుకున్న 15 మందిని రైల్వే కోర్టులో హాజరుపరచనున్నారు పోలీసులు.

Must Watch: https://www.youtube.com/watch?v=Q0eu7HCRBgw

దేశవ్యాప్తంగా సుబ్బారావుకి 9 డిఫెన్స్ అకాడమీలు ఉన్నాయి. ఆర్మీ కోచింగ్ పేరుతో ఒక్కో అభ్యర్థి నుంచి రూ.2లక్షల ఫీజు వసూలు చేస్తున్నాడు. అభ్యర్థులు తన అకాడమీలో చేరేలా ఆకర్షించేందుకు పేమెంట్ ను విడతల వారీగా చెల్లించే అవకాశం ఇచ్చాడు. అంతేకాదు తన వద్ద శిక్షణ తీసుకుంటే జాబ్ గ్యారంటీ అంటూ అభ్యర్థులను ఆకట్టుకుంటున్నాడు. అయితే, ఆర్మీకి సెలెక్ట్ అయిన తర్వాతే మొత్తం అమౌంట్ చెల్లించేలా అభ్యర్థులకు కొటేషన్ ఇచ్చాడు. గ్యారంటీ కింద అభ్యర్థులకు చెందిన టెన్త్ మెమోలు తీసుకున్నాడు.(Subba Rao)

Secunderabad Violence Remand Report : సికింద్రాబాద్ అల్లర్ల కేసు.. రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలు

అయితే, ఇప్పటికే ప్రాథమిక పరీక్షలు పూర్తి చేసుకున్న అభ్యర్థులు రాత పరీక్ష రాసేందుకు ప్రిపేర్ అవుతున్నారు. ఇంతలోనే కేంద్ర ప్రభుత్వం అగ్నిపథ్ పథకం ప్రకటించింది. ఇందుకు రాతపరీక్ష అవసరం లేదు. దీంతో సుబ్బారావుకి మైండ్ బ్లాంక్ అయ్యింది. సుబ్బారావుకి అభ్యర్థుల నుంచి రావాల్సిన దాదాపు రూ.50 కోట్లు ఆగిపోయాయి. దీంతో ఎలాగైనా అభ్యర్థులను రెచ్చగొట్టి రాతపరీక్ష నిర్వహించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని ప్లాన్ చేశాడు సుబ్బారావు. దాని ఫలితమే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో ఆర్మీ రిక్రూట్ మెంట్ అభ్యర్థుల విధ్వంసకాండ.

agnipath: తెలంగాణ పోలీసుల అదుపులో కోచింగ్ సెంటర్ నిర్వాహకుడు సుబ్బారావు

ఇక సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో విధ్వంసం కేసులో ఇప్పటికే 71మందిపై కేసు నమోదు చేసిన పోలీసులు ఇంకో 25 మంది పై వారి పాత్ర ఉన్నట్లుగా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు పోలీసులు. దీంతో అరెస్టుల సంఖ్య 100కు పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అరెస్ట్ అయిన వారంతా ఆర్మీ ఉద్యోగాల కోసం వేచ్చి చూస్తున్న వారే. ఫిజికల్ టెస్ట్, మెడికల్ ఫిట్ నెస్ సాధించిన వారే ఉన్నారు. మొత్తంగా తన స్వార్థం కోసం సుబ్బారావు చేసిన పని తమ పిల్లల జీవితాలను నాశనం చేసిందని వారి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు.

సైనిక నియామకాల కోసం కేంద్రం ప్రకటించిన అగ్నిపథ్ స్కీమ్ ను రద్దు చేయాలని, ఇప్పటికే రద్దు చేసిన ఆర్మీ పరీక్షను తిరిగి పెట్టాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం (జూన్ 17) సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో ఆర్మీ అభ్యర్థులు చేపట్టిన ఆందోళన తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. ఆందోళనకారులు రైల్వేస్టేషన్ ను ధ్వంసం చేయడంతో పాటు రైళ్లకు నిప్పు పెట్టారు. పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు పోలీసులు ఎంతో ప్రయత్నించినా ఫలితం దక్కలేదు. దీంతో పోలీసులు లాఠీ ఛార్జ్ చేయడంతో… ఆందోళనకారులు పోలీసులపై రుళ్లు రువ్వారు. ఈ క్రమంలో పోలీసులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఒక యువకుడికి ఛాతీలో బుల్లెట్ దిగి మరణించాడు. పలువురు గాయపడ్డారు.