Secunderabad victim: సికింద్రాబాద్ కాల్పుల మృతుడి కుటుంబానికి ఉద్యోగం

అనంతరం రాకేష్ సంతాప సభలో మంత్రి ఎర్రబెల్లి మాట్లాడారు. అగ్నిపథ్ స్కీం రద్దు చేయకుంటే కేంద్ర ప్రభుత్వం కూలిపోతుంది. మోదీ తీసుకొచ్చిన నల్ల చట్టాల వల్ల 700 మంది రైతులు చనిపోయారు. రాకేష్ మృతిని కొందరు రాజకీయం కోసం వాడుకుంటున్నారు.

Secunderabad victim: సికింద్రాబాద్ కాల్పుల మృతుడి కుటుంబానికి ఉద్యోగం

Secunderabad Victim

Secunderabad victim: ఇటీవల జరిగిన సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ కాల్పుల్లో మరణించిన రాకేష్ కుటుంబానికి ఉద్యోగం కల్పించింది తెలంగాణ ప్రభుత్వం. నర్సంపేట ఆర్డీవో కార్యాలయంలో రాకేష్ సోదరుడికి ఉద్యోగం కల్పించారు. ఈ సందర్భంగా రూ.25 లక్షల చెక్కును, ఉద్యోగ నియామక పత్రాన్ని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు.. రాకేష్ సోదరుడికి అందించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ గోపీ, ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్ రెడ్డి, ఆరూరి రమేష్ పాల్గొన్నారు.

YS Jagan: శ్రీకాకుళం జిల్లాకు సీఎం వరాల జల్లు

అనంతరం రాకేష్ సంతాప సభలో మంత్రి ఎర్రబెల్లి మాట్లాడారు. ‘‘అగ్నిపథ్ స్కీం రద్దు చేయకుంటే కేంద్ర ప్రభుత్వం కూలిపోతుంది. మోదీ తీసుకొచ్చిన నల్ల చట్టాల వల్ల 700 మంది రైతులు చనిపోయారు. రాకేష్ మృతిని కొందరు రాజకీయం కోసం వాడుకుంటున్నారు. సికింద్రాబాద్ కాల్పుల్లో మొదట రబ్బర్ బుల్లెట్లు ప్రయోగించకుండా, నేరుగా మామూలు బుల్లెట్లే ఉపయోగించారు. దీని వెనుక కుట్ర ఉంది. సైనికులపై కిషన్ రెడ్డి చేసిన మాటలు అవమానకరంగా ఉన్నాయి. కాల్పుల్లో మరణించిన రాకేష్ కుటుంబాన్ని ఆదుకుంటామని కేంద్రం ప్రకటించకపోవడం బాధాకరం. రాకేష్ కుటుంబాన్ని సీఎం దగ్గరకు తీసుకెళ్తాం. మరింతగా ఆదుకుంటాం. రాకేష్ సొంతూరు డబ్బీర్ పేటను దత్తత తీసుకుని అభివృద్ధి చేస్తా’’ అని ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు.

Roorkee Gangrape: మహిళ, ఆమె ఆరేళ్ల కూతురుపై కారులో అత్యాచారం

‘‘ఉద్యోగం కోసం చేసిన పోరాటంలో రాకేష్ చనిపోయారు. ఆయన కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంది. ముఖ్యమంత్రి కేసీఆర్ మానవతా దృక్పథంతో ఆలోచించి రూ.25 లక్షల ఎక్స్‌గ్రేషియా, ప్రభుత్వ ఉద్యోగం కల్పించారు’’ అని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి వ్యాఖ్యానించారు.