ఇదీ అసలు రూపం, 18ఏళ్ల అమ్మాయిని పెళ్లి చేసుకున్న 48ఏళ్ల దొంగ స్వామి, చంపేస్తానని బెదిరింపులు

వాడో దొంగ స్వామి. వయసు 48 ఏళ్లు. తన మాయ మాటలతో 18 ఏళ్ల అమ్మాయిని లోబర్చుకున్నాడు. ఆ తర్వాత పారిపోయి తిరుపతిలో పెళ్లి చేసుకున్నాడు. పెళ్లయ్యాక తన నిజ

  • Published By: veegamteam ,Published On : March 5, 2020 / 04:03 AM IST
ఇదీ అసలు రూపం, 18ఏళ్ల అమ్మాయిని పెళ్లి చేసుకున్న 48ఏళ్ల దొంగ స్వామి, చంపేస్తానని బెదిరింపులు

వాడో దొంగ స్వామి. వయసు 48 ఏళ్లు. తన మాయ మాటలతో 18 ఏళ్ల అమ్మాయిని లోబర్చుకున్నాడు. ఆ తర్వాత పారిపోయి తిరుపతిలో పెళ్లి చేసుకున్నాడు. పెళ్లయ్యాక తన నిజ

వాడో దొంగ స్వామి. వయసు 48 ఏళ్లు. తన మాయ మాటలతో 18 ఏళ్ల అమ్మాయిని లోబర్చుకున్నాడు. ఆ తర్వాత పారిపోయి తిరుపతిలో పెళ్లి చేసుకున్నాడు. పెళ్లయ్యాక తన నిజ స్వరూపం బయటపెట్టాడు. చంపేస్తానని అమ్మాయి బంధువులకు వార్నింగ్ ఇస్తున్నాడు. కర్నాటక రాష్ట్రం కోలార్ తాలూకాలోని హోళలి గ్రామంలో దొంగ స్వామి బరి తెగింపు సంచలనంగా మారింది.

దత్తాత్రేయ అవధూత స్వామి అలియాస్‌ రాఘవేంద్ర అసలు రూపం వెలుగులోకి వచ్చింది. నా జోలికి కానీ, నా పెళ్లాం జోలికి కానీ వస్తే సుపారీ గుండాలతో చంపేయిస్తానని యువతి బావ అరుణ్‌కుమార్‌ను కపటస్వామి బెదిరించాడు. ఫిబ్రవరి 22న నిందితుడు యువతితో కలిసి పరారై తిరుపతిలో వివాహం చేసుకున్నాడు. దీనిపై యువతి బంధువులు కోలారు రూరల్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. ఇన్ని రోజులు తప్పించుకుని తిరిగిన అతడు యువతితో పెళ్లి తర్వాత స్వామీజీ గెటప్‌ తీసేసి మామూలుగా తయారయ్యాడు. 

తనపై పోలీసులకు ఫిర్యాదు చేయడంపై దొంగస్వామి ఆగ్రహించాడు. యువతి బావ అరుణ్‌కుమార్‌కు ఫోన్‌ చేశాడు. నాపై పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేస్తావా అని దూషించాడు. నేనిప్పుడు స్వామీజీ కాదన్నాడు. మా ఇద్దరి జోలికి వస్తే ఊరుకునేది లేదని వార్నింగ్ ఇచ్చాడు. రూ.50 లక్షలు లేదా కోటి రూపాయలు అయినా బెంగుళూరులో ఉన్న మా కుర్రాళ్లకు సుపారీగా ఇచ్చి హత్య చేయిస్తానని బెదిరించాడు. కపట స్వామిజి బెదిరింపులను అరుణ్ ఫోన్ లో రికార్డ్ చేశాడు. ఇప్పుడా వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. దీనిపై అరుణ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు రంగంలోకి దిగారు. దొంగ స్వామి కోసం గాలిస్తున్నారు.

స్వామీజీ అవతారం ఎత్తిన తొలి రోజుల్లో రాఘవేంద్ర హోళలి గ్రామస్తులకు మాయమాటలు చెప్పాడు. పిల్లలకు వేద మంత్రాలు నేర్పిస్తానని చెప్పాడు. గ్రామంలో గోశాల నిర్మిస్తానని హామీ ఇచ్చాడు. కొన్ని రోజుల్లో హోళలి గ్రామాన్ని ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రంగా మార్చేస్తానని గ్రామస్తులకు వాగ్దానం ఇచ్చాడు. కట్ చేస్తే.. దొంగ స్వామి నిజ రూపం బయటపడింది. గ్రామానికి చెందిన యువతిని మోసం చేసి పెళ్లి చేసుకున్నాడు. రాఘవేంద్ర నిజ స్వరూపం వెలుగులోకి రావడంతో గ్రామస్తులు షాక్ తిన్నారు. ఆ దొంగ స్వామిని వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. ఆ కపట స్వామి చెర నుంచి యువతిని కాపాడాలని పోలీసులకు విజ్ఞప్తి చేశారు.