సీనియర్లు ర్యాగింగ్‌ : మనస్తాపంతో ఇంటర్‌ విద్యార్థి ఆత్మహత్యాయత్నం

మహబూబ్‌నగర్‌లో ర్యాగింగ్ కలకలం రేపింది. సీనియర్లు ర్యాగింగ్‌ చేయడంతో మనస్తాపానికి గురైన ఓ ఇంటర్‌ విద్యార్ధి ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు.

  • Published By: veegamteam ,Published On : December 15, 2019 / 06:59 AM IST
సీనియర్లు ర్యాగింగ్‌ : మనస్తాపంతో ఇంటర్‌ విద్యార్థి ఆత్మహత్యాయత్నం

మహబూబ్‌నగర్‌లో ర్యాగింగ్ కలకలం రేపింది. సీనియర్లు ర్యాగింగ్‌ చేయడంతో మనస్తాపానికి గురైన ఓ ఇంటర్‌ విద్యార్ధి ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు.

మహబూబ్‌నగర్‌లో ర్యాగింగ్ కలకలం రేపింది. సీనియర్లు ర్యాగింగ్‌ చేయడంతో ఓ ఇంటర్‌ విద్యార్ధి ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. తిమ్మాజీపేట మండలం ఆర్సీ తండాకు చెందిన సంతోష్ నాయక్‌ మహబూబ్‌నగర్‌లోని ప్రతిభ జూనియర్‌ కాలేజీలో ఇంటర్ ఫస్టియర్ చదువుతున్నాడు. సంతోష్‌ నాయక్‌ హాస్టల్‌లో ఉంటూ చదువుకుంటున్నాడు.

ఈ క్రమంలో తాను చుదువుతున్న ప్రతిభ జూనియర్‌ కాలేజీలో సీనియర్లు సంతోష్‌ను తిడుతూ, కొట్టారు. ర్యాగింగ్‌ గురించి కాలేజీ యాజమాన్యానికి ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోలేదు. దీంతో సంతోష్ తన సొంతూరు ఆర్సీ తండాకు వెళ్లిపోయాడు. ర్యాగింగ్ చేయడంతో మనస్తాపంతో చెందిన సంతోష్ ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. 

తల్లిదండ్రులు, స్థానికులు గమనించి వెంటనే అతన్ని జడ్చర్ల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వైద్యులు సంతోష్ కు వైద్యం అందిస్తున్నారు. సంతోష్ ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉంది. 24 గంటలు పరిస్థితి ఇలాగే ఉంటే మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ కు తరలించే అవసరం ఉంటుందని డాక్టర్లు చెప్పారు.

ప్రతిభ జూనియర్‌ కాలేజీలో పలు సందర్భాల్లో ఘర్షణలు చోటు చేసుకున్న సంఘనటలు చాలానే ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ర్యాంగింగ్ లేని క్రమంలో మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని ప్రతిభ జూనియర్‌ కాలేజీలో మరోసారి ర్యాగింగ్ ఘటన వెలుగులోకి రావడంతో విద్యార్థలంతా భయభ్రాంతులకు గురవుతున్నారు. కాలేజీలో చదువుకునేది ఎలా అని వాపోతున్నారు.