Sexual harassment : డాక్టర్ పై లైంగిక వేధింపులు….కారుకు జీపీఎస్ అమర్చిన శాడిస్ట్ పేషెంట్

జుట్టు రాలిపోతోందని వైద్యురాలి దగ్గరకు వెళ్లి ఆమెను లైంగికంగా వేధించి... ఆమె కారుకు జీపీఎస్ పెట్టి వెంటాడిన శాడిస్టును ..అతనికి సహకరించిన టీఆర్ఎస్ నాయకుడిపై హైదరాబాద్ జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు.

Sexual harassment : డాక్టర్ పై లైంగిక వేధింపులు….కారుకు జీపీఎస్ అమర్చిన శాడిస్ట్ పేషెంట్

Sexual Harassament On Doctor

Sexual harassment on a doctor … Sadist patient fitted with GPS to doctor car : జుట్టు రాలిపోతోందని వైద్యురాలి దగ్గరకు వెళ్లి ఆమెను లైంగికంగా వేధించి… ఆమె కారుకు జీపీఎస్ పెట్టి వెంటాడిన శాడిస్టును ..అతనికి సహకరించిన టీఆర్ఎస్ నాయకుడిపై   హైదరాబాద్ జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు  చేశారు.

జుట్టు  రాలిపోతోందని హైదరాబాద్ లోని ఓ ఆస్పత్రికి వెళ్లిన విశ్వనాధ్ అనే  వ్యక్తి… ఆ వైద్యురాలిని తనతో స్నేహం చేయాలంటూ బలవంతం చేశాడు. ఆమె తిరస్కరించే సరికి ఆమె ఉంటున్న అపార్ట్ మెంట్ లో ఇల్లు అద్దెకు తీసుకుని ఆమెకు సన్నిహితంగా తిరగటం మొదలెట్టాడు.

అవసరం ఉన్నా లేకపోయినా పలకరిస్తూ ఆమెను వేధించసాగాడు. ఆమెతో అసభ్యంగా ప్రవర్తించసాగాడు. డాక్టర్ కొడుక్కి బొమ్మలు ఇస్తూ వాళ్లింట్లోకి వెళ్తూ   వారికి దగ్గిరవ్వాలని పిచ్చి  ప్రయత్నాలు చేశాడు. ఆమె ఎప్పుడెప్పుడు,  ఎక్కడెక్కడకు వెళ్తోందో తెలుసుకోటానికి  ఆమెకు  తెలియకుండా ఆమె కారుకు జీపీఎస్ అమర్చాడు.

దాని ఆధారంగా ఆమె ఎక్కడెక్కడకు వెళ్తోంది…. అక్కడేమి చేస్తోందో తెలుసుకోటానికి మనుషులను పెట్టుకున్నాడు.  వైద్యురాలు ఇంట్లోలేనప్పుడు ఆమె కొడుక్కి….తండ్రిపై వ్యతిరేకత  కలిగేలా  లేనిపోనివి చెప్పేవాడు.

ఇదంతా తెలుసుకున్న ఆమె ఆ అపార్ట్ మెంట్ ఖాళీ చేసి.. చేస్తున్న ఉద్యోగం మానేసి .. వేరే చోటకు అద్దెకు వెళ్లి, అక్కడ వేరే ఆస్పత్రిలో చేరింది. ఆమె కారుకు అమర్చిన జీపీఎస్ ఆధారంగా డాక్టర్    కొత్తగా ఎక్కడకు వెళ్లిందో  తెలుసుకున్నాడు.

నిను వీడని నీడను నేనే….. అంటూ విశ్వనాధ్ మళ్లీ అక్కడా ఆమె   వెంటపడ్డాడు. ఈ సారి  ఆమె పనిచేసే ఆస్పత్రికి సమీపంలోనే ఇల్లు అద్దెకు తీసుకున్నాడు. రోజూ ఆమె రాకపోకలు పరిశీలించేవాడు.

ఆమె కుమారుడ్ని తన వద్ద వదిలి ఆస్పత్రికి వెళ్లాలని విశ్వనాధ్ కోరాడు. లేదంటే కుమారుడ్ని హతమారుస్తానని బెదిరించాడు. అతడి వేధింపులు భరించలేని డాక్టర్ తన భర్తకు ఈ విషయం చెప్పింది.

ఆమె భర్త విశ్వనాధ్ ను హెచ్చరించేందుకు రెండు రోజుల క్రితం ఇంటికి వెళ్లగా అక్కడ విశ్వనాధ్ మిత్రుడు…టీఆర్ఎస్ నాయకుడు శ్రీకాంత్ గౌడ్, మరో స్నేహితుడు సురేష్ లు ఉన్నారు.  విశ్వనాధ్ తన భార్యను వేధిస్తున్నాడని టీఆర్ఎస్ నాయకుడు శ్రీకాంత్ గౌడ్ కు ఆమె భర్త చెప్పగా….తన మిత్రుడ్ని సమర్ధిస్తూ…. అతను ఉల్టా బెదిరించాడు.

ఇక్కడి నుంచి వెళ్లకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని శ్రీకాంత్ గౌడ్ హెచ్చరించాడు. దీంతో డాక్టర్ తన భర్తతో కలిసి జూబ్లీహిల్స్ పోలీసులకు మంగళవారం ఫిర్యాదు చేసింది. విశ్వనాధ్, సురేష్ , టీఆర్ఎస్ నాయకుడు పులి శ్రీకాంత్ పటేల్ గౌడ్,  నాగరాజు అనే వారిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.