చిగురుపాటి మర్డర్ కేసు : నా పరువు పోయింది – శ్రిఖా

  • Published By: madhu ,Published On : February 7, 2019 / 03:52 PM IST
చిగురుపాటి మర్డర్ కేసు : నా పరువు పోయింది – శ్రిఖా

హైదరాబాద్ : ప్రముఖ పారిశ్రామిక వేత్త, ప్రవాస భారతీయుడు చిగురుపాటి జయరాం మర్డర్ కేసులో రాకేష్ రెడ్డి నిందితుడని ఏపీ పోలీసులు తేల్చారు. అయితే ఈ కేసులో శ్రిఖా ప్రమేయం ఉందంటూ…జయరాం వైఫ్ ఆరోపణలు గుప్పిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో తెలంగాణ పోలీసులు కేసును దర్యాప్తు చేపట్టనున్నారు. ఈ నేపథ్యంలో శ్రిఖా చౌదరితో 10tv ముచ్చటించింది. ఈ కేసులో కీలక వ్యాఖ్యలు చేసింది శ్రిఖా. 

జయరాం హత్య చేసిన అనంతరం శ్రిఖా..పేరు తప్ప…దేనిపై కూడా చర్చ జరగలేదన్నారు. భర్త చనిపోయే బాధలో ఉన్న పద్మశ్రీ ఉంటే…తనపై..తన ఫ్యామిలీపై వస్తున్న వార్తలతో ఆమె హార్ట్ అయి ఉండొచ్చని తెలిపారు. ఎవరైనా తప్పుడు సలహాలు..సూచనలు ఇస్తున్నారేమో…తనను ఇరికించడానికి ప్రయత్నిస్తున్నట్లు అనుమానం ఉందన్నారు. ఈ కేసుతో ఎలాంటి సంబంధం లేదని కుండబద్ధలు కొట్టిన శ్రిఖా..పోలీసులకు సహకారం అందిస్తానని తెలిపారు. తనను పక్కాగా ఇరికించే ప్రయత్నం చేస్తే తప్పకుండా న్యాయపోరాటం చేస్తానని స్పష్టం చేశారు. జయరాం హత్య కేసుతో తనకు..తన ఫ్యామిలీ పరువు పోయిందని..అన్ని విషయాల్లో తాము నష్టపోయామన్నారు శ్రిఖా. పోలీసులు ఈ కేసును పారదర్శకంగా విచారిస్తారనే నమ్మకం ఉందన్నారు.