Raj Kundra: నీలి చిత్రాల కేసులో శిల్పాశెట్టి భర్త అరెస్ట్!

అశ్లీల చిత్రాలు నిర్నించి,వాటిని యాప్ ల ద్వారా ప్రసారం చేసినందుకు ప్రముఖ వ్యాపారవేత్త, సినీనటి శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రాను ముంబై పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు.

Raj Kundra: నీలి చిత్రాల కేసులో శిల్పాశెట్టి భర్త అరెస్ట్!

Kundra Arrested

Raj Kundra Arrested :  నీలి చిత్రాలను నిర్మించి, వాటిని యాప్‌ల ద్వారా ప్రసారం చేశారనే ఆరోపణలతో ప్రముఖ వ్యాపారవేత్త, సినీనటి శిల్పాశెట్టి భర్త రాజ్‌కుంద్రాను ముంబై పోలీసులు సోమవారం(19 జులై 2021) అరెస్ట్ చేశారు. ఫిబ్రవరిలో ఈ కేసుకు సంబంధించి ఎఫ్ఐఆర్ నమోదైంది. కేసు విచారణ చేపట్టిన పోలీసులు ఈరోజు తగిన ఆధారాలతో రాజ్‌కుంద్రాను అరెస్ట్ చేశారు. తమ వద్ద తగిన ఆధారాలు ఉన్నాయని కేసు దర్యాప్తు దశలో ఉందని ముంబై పోలీసు అధికారులు తెలిపారు.

శిల్పా శెట్టి రాజ్‌కుంద్రాను 2009లో వివాహం చేసుకున్నారు. వీరికి 2012లో వియాన్ రాజ్ అనే కుమారుడు పుట్టాడు. 2020 లో ఈ జంట సరోగసీ ద్వారా సమీషాకు జన్మనిచ్చారు. రాజ్‌కుంద్రా  వివాదాల్లో చిక్కుకోవటం ఇది మొదటి సారి కాదు.

మోడల్, నటి పూనమ్ పాండే రాజ్ కుంద్రా అతని సహచరుడిపై ముంబై కోర్టులో గతంలో ఫిర్యాదు చేసారు. దీంతో రాజ్ కుంద్రా సెషన్స్ కోర్టులో ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకుని గత నెలలో వార్తల్లో నిలిచారు.   రాజ్‌కుంద్రా  సంస్ధతో ఒప్పందం ముగిసిని తర్వాత తన చిత్రాలను వీడియోలను చట్టవిరుధ్దంగా ఉపయోగించారని పూనం ఆరోపించారు.

సోమవారం రాజ్‌కుంద్రాను అదుపులోకి తీసుకున్న పోలీసులు అతనిపై ఐపీసీ సెక్షన్ ఐపిసి సెక్షన్ 292, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సెక్షన్ 67, 67 ఎ, మహిళల అసభ్య ప్రాతినిధ్యం (నిషేధం) రూల్స్ 3, 4 కింద కేసు నమోదు చేసారు. అశ్లీల చిత్రాల నిర్మాణానికి సంబంధించి పోలీసులు గతేడాది కొంతమందిని అరెస్ట్ చేశారు. వారు ఇచ్చిన సమాచారంతో రాజ్‌కుంద్రా కు అశ్లీల చిత్రాల నిర్మాణంలో సంబంధాలున్నట్లు తేలటంతో పోలీసులు ఈరోజు అరెస్ట్ చేశారు.

కాగా….. పోలీసులు ఆరోపణలను రాజ్‌కుంద్రా ఖండించారు. ఈ కేసుతో తనకు సంబంధం లేదని… అశ్లీల చిత్రాలు నిర్నించారనే ఆరోపణలు ఎదుర్కోంటున్న సంస్ధనుంచి తాను ఎప్పుడో బయటకు వచ్చినట్లు ఆయన వివరణ ఇచ్చారు. అందుకు సంబంధించిన పత్రాలనుకూడా ముంబై పోలీసులకు అందచేశారు. పోలీసులు రాజ్‌కుంద్రాను విచారిస్తున్నారు.