Wife Murder For Salt : వీడెవడండీ బాబూ.. కూరలో ఉప్పు తక్కువైందని భార్యని హత్య చేసిన భర్త

కూరలో ఉప్పు తక్కువైందని భార్యను చంపేశాడో ప్రబుద్ధుడు. ఏంటి? షాక్ అయ్యారా? అవును, నిజమే.. కోపంతో రగిలిపోయిన భర్త విచక్షణ కోల్పోయాడు. నాకే ఎదురు చెబుతావా అంటూ భార్యను కత్తితో పొడిచి హత్య చేశాడు.

Wife Murder For Salt : వీడెవడండీ బాబూ.. కూరలో ఉప్పు తక్కువైందని భార్యని హత్య చేసిన భర్త

Wife Murder For Salt : చిన్న చిన్న విషయాలకే మనిషి విచక్షణ కోల్పోతున్నాడు. పట్టరాని కోపంలో దారుణాలకు తెగబడుతున్నాడు. అయిన వారు, రక్త సంబంధీకులు అని కూడా చూడకుండా కడతేరుస్తున్నారు. ఓ చిన్న కారణానికే ఓ భర్త కట్టుకున్న భార్యను హత్య చేశాడు. ఆ కారణం ఏంటో తెలిస్తే షాక్ అవ్వడం ఖాయం. కూరలో ఉప్పు తక్కువైందని భార్యను చంపేశాడో ప్రబుద్ధుడు. ఏంటి? షాక్ అయ్యారా? అవును, నిజమే.. ఈ షాకింగ్ ఘటన బీహార్ రాష్ట్రం సరన్ జిల్లాలో జరిగింది.

మాంఝీ పోలీస్ స్టేషన్ పరిధిలోని కలాన్‌ గ్రామానికి చెందిన ప్రభురామ్ (55) భార్య శుక్రవారం రాత్రి వంట చేసింది. అయితే, ఆరోగ్యం దృష్ట్యా కూరలో కాస్త ఉప్పు తగ్గించింది ఆమె. భోజన సమయంలో ఉప్పు తక్కువగా ఉందని భార్యపై ప్రభురాం ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఆరోగ్యం కోసమే కూరలో ఉప్పు తగ్గించానని భార్య చెప్పినా అతడు వినిపించుకోలేదు. ఈ విషయమై భార్యాభర్తల మధ్య మాటామాటా పెరిగింది. అది కాస్త చినికిచినికి గాలివానలా మారింది.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

అంతే.. కోపంతో రగిలిపోయిన ప్రభురాం విచక్షణ కోల్పోయాడు. నాకే ఎదురు చెబుతావా అంటూ భార్యను కత్తితో పొడిచి హత్య చేశాడు. ఆ తర్వాత అక్కడి నుంచి పారిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగారు. కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేపట్టారు. ప్రభురాంను అరెస్ట్ చేశారు.

కూరలో ఉప్పు తక్కువైందని పెళ్లాన్ని భర్త హత్య చేసి ఘటన స్థానికులను షాక్ కి గురి చేసింది. ఇది మరీ టూమచ్ అని అంతా విస్తుపోతున్నారు. ఆ మాత్రం దానికే మర్డర్ చేయడం దారుణం అంటున్నారు. కూరలో ఉప్పు తక్కువైతే కాస్త ఉప్పు వేసుకుని తింటే సరిపోతుంది. లేదా సర్దుకుపోయి తింటే సరిపోతుంది. అదీ కాదంటే.. వంట చేసిన భార్యని నాలుగు మాటలంటే సరిపోతుంది. అంతేకానీ, ఆ మాత్రం దానికే మర్డర్ చేయడం ఏంటిరా నాయనా? అని తలలు పట్టుకుంటున్నారు.