లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Crime

మదనపల్లి జంటహత్య కేసులో షాకింగ్ ట్విస్ట్!

Updated On - 8:05 am, Tue, 26 January 21

shocking-twist-in-madanapally-twin-murder

Shocking Twist in Madanapally twin murder : మదనపల్లె జంట హత్యల కేసులో కొత్త ట్విట్ షాకింగ్ గురిచేస్తోంది. మళ్లీ పుడతామని మూడ నమ్మకంతో కన్నతల్లిదండ్రులే కూతుళ్లను అతికిరాతకంగా హత్యచేసిన ఘటనలో కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. శివనగర్‌లో నివాసం ఉండే ప్రభుత్వ మహిళా కళాశాల ప్రిన్సిపాల్‌ వల్లేరు పురుషోత్తం నాయుడు, పద్మజ దంపతులు తమ కుమార్తెలైన అలేఖ్య (27), సాయిదివ్య (22)లను హత్యచేశారు.

పూజల పేరుతో కూతుళ్లను హత్యచేసి ఆపై తాము కూడా బలిదానం చేసుకోవాలని భావించారు. పోలీసులు ఎంట్రీ ఇవ్వడంతో వీరి ప్లాన్ బెడిసికొట్టింది. ఎందుకిలా చేశారంటే.. ఇలా చేయడం వల్ల నలుగురూ కలిసి మరోసారి జన్మిస్తామనేది మూఢ నమ్మకమట. పురుషోత్తం తన సహోద్యోగి ఒకరికి ఫోన్‌ చేసి ఇలా చెప్పాడంట. ముందు తమ కూతుళ్లను చంపి.. ఆ తర్వాత తాము కూడా చనిపోతామని చెప్పాడంట.

అంతేకాదు.. అద్భుతాన్ని వచ్చి చూడాలని కూడా కోరారంట. సహోద్యోగి వెంటనే ఈ విషయాన్ని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వెలుగులోకి వచ్చింది. పోలీసుల రంగం ప్రవేశంతో చనిపోవడానికి సిద్ధంగా ఉన్న పురుషోత్తం, పద్మజలను అడ్డుకున్నారు. తల్లి పద్మజ మాత్రం తన బిడ్డలు బతికి వస్తారని అనడం గమనార్హం. కొంతమంది ఓర్వలేని వ్యక్తులెవరో కుటుంబాన్ని ఇలా పూజల పేరుతో ఈ ఘాతుకం చేయించి ఉంటారని అంటున్నారు.

అలేఖ్య, సాయిదివ్య మృతదేహాలకు పోస్టుమార్టం అనంతరం అంత్యక్రియలు నిర్వహించారు. కన్నతల్లిదండ్రులు అయి ఉండి ఇలాంటి దారుణానికి పాల్పడటాన్ని నమ్మలేకపోతున్నామని బంధువులు, స్థానికులు విమర్శిస్తున్నారు.

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *