Acid Bottle : బాబోయ్.. నీళ్లు అడిగితే యాసిడ్ బాటిల్ ఇచ్చిన షాపింగ్ మాల్ సిబ్బంది

షాపింగ్ మాల్ కు వెళ్లిన ఓ కస్టమర్ కి దాహం వేసింది. దీంతో అతడు కౌంటర్ దగ్గరికి వెళ్లి మంచి నీళ్ల బాటిల్ అడిగాడు. అయితే సిబ్బంది వాటర్ బాటిల్ కాకుండా యాసిడ్ బాటిల్ ఇచ్చారు.

Acid Bottle : బాబోయ్.. నీళ్లు అడిగితే యాసిడ్ బాటిల్ ఇచ్చిన షాపింగ్ మాల్ సిబ్బంది

Acid Bottle

Acid Bottle : సిబ్బంది అంతులేని నిర్లక్ష్యమో, ఆ కస్టమర్ బ్యాడ్ టైమో.. తెలియదు కానీ.. జరగరాని దారుణం జరిగిపోయింది. తాగేందుకు మంచి నీళ్ల బాటిల్ అడిగిన ఓ కస్టమర్ కి ఆ షాపింగ్ మాల్ సిబ్బంది పొరపాటున యాసిడ్ బాటిల్ ఇచ్చేశారు. ఇది గ్రహించని కస్టమర్.. నీళ్లు అనుకుని బాటిల్ లోని యాసిడ్ తాగేశాడు. అంతే.. ఆసుపత్రి పాలయ్యాడు.

Must Watch: https://www.youtube.com/watch?v=Q0eu7HCRBgw

ఈ షాకింగ్ ఘటన నిజామాబాద్ లోని ఓ షాపింగ్ మాల్ లో చోటు చేసుకుంది. షాపింగ్ మాల్ కు వెళ్లిన ఓ కస్టమర్ కి దాహం వేసింది. దీంతో అతడు కౌంటర్ దగ్గరికి వెళ్లి మంచి నీళ్ల బాటిల్ అడిగాడు. వెంటనే వర్కర్ ఓ బాటిల్ అతడికి ఇచ్చాడు. అయితే అది మంచి నీళ్ల బాటిల్ కాదు యాసిడ్ బాటిల్. పొరపాటున ఆ వర్కర్ యాసిడ్ బాటిల్ ఇచ్చేశాడు. ఇద్దరూ ఇది గమనించలేదు.

యాసిడ్ బాటిల్ ను గ్రహించని కస్టమర్.. తాగే నీళ్లు అనుకుని యాసిడ్ సేవించాడు. అలాగే షాపింగ్ మాల్ లో పనిచేసే వర్కర్ కూడా నీళ్లు అనుకుని యాసిడ్ తాగాడు. దీంతో వారిద్దరూ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. పరిస్థితి విషంగా మారింది. మెరుగైన చికిత్స కోసం వారిద్దరిని హైదరాబాద్ లోని ఆసుపత్రికి తరలించారు. ఈ నెల 29న పెళ్లి ఉండటంతో.. బాధితుడు విజయ్.. షాపింగ్ కోసం షాపింగ్ మాల్ కు వెళ్లాడు.

Bengaluru: మ‌హిళ‌పై యాసిడ్ దాడి చేసిన తోటి ఉద్యోగి

నిర్లక్ష్యంగా వ్యవహరించి విజయ్ ప్రాణాల మీదకు తెచ్చిన షాపింగ్ మాల్ యాజమాన్యంపై బాధితుడి కుటుంబసభ్యులు మండిపడుతున్నారు. షాపింగ్ మాల్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటన స్థానికులను షాక్ కి గురి చేసింది. నీళ్లు తాగే ముందే.. ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకోవడం ఎందుకైనా మంచిదంటున్నారు.